te_tw/bible/names/cana.md

1.4 KiB

కానా

నిర్వచనం:

కానా ఒక గ్రామం లేక ఊరు. ఇది గలిలయ పరగణాలో నజరేతుకు తొమ్మిది మైళ్ళు ఉత్తరాన ఉంది.

  • కానా పన్నెండు మందిలో ఒకడైన నతనియేలు సొంత ఊరు.
  • యేసు కానాలో ఒక వివాహ ఉత్సవానికి హాజరై తన మొదటి అద్భుతం చేశాడు. అయన నీరును ద్రాక్షారసంగా మార్చాడు.
  • కొంత కాలం తరువాత, యేసు కానాకు తిరిగి వచ్చాడు. అక్కడ అయన కపెర్నహోము నుండి వచ్చిన ఒక అధికారిని కలుసుకున్నాడు. అతడు తన కుమారుని స్వస్తతకై అర్థించాడు.

(చూడండి: కపెర్నహోము, గలిలయ, పన్నెండు మంది)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2580