2.0 KiB
2.0 KiB
కపెర్నహోము
వాస్తవాలు:
కపెర్నహోము చేపలు పట్టే వారు నివసించే గ్రామం. ఇది గలిలీ సరస్సు వాయవ్య తీరాన ఉంది.
- యేసు గలిలయలో బోధించే సమయాల్లో కపెర్నహోములో నివసించాడు.
- అనేకమంది యేసుశిష్యులు కపెర్నహోము వాస్తవ్యులు.
- యేసు ఇక్కడ చనిపోయిన అమ్మాయిని బ్రతికించడంతో సహా అనేక అద్భుతాలు చేశాడు.
- యేసు బహిరంగంగా గద్దించిన మూడు పట్టణాల్లో కపెర్నహోము ఒకటి. ఎందుకంటే ఆ ప్రజలు తన సందేశం త్రోసిపుచ్చి తనలో నమ్మకం ఉంచలేదు. వారి అపనమ్మకం మూలంగా దేవుడు వారిని శిక్షిస్తాడని యేసు హెచ్చరించాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: గలిలయ, గలిలీ సరస్సు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G2584