te_tw/bible/names/galilee.md

3.1 KiB

గలిలయ, గలిలయుడు, గలిలయులు

వాస్తవాలు:

గలిలయ ఇశ్రాయేలు ఉత్తర ప్రాంతం. సమరయకు ఉత్తరాన ఉంది. "గలిలయుడు" అంటే గలిలయలో నివసించే వాడు.

  • గలిలయ, సమరయ, యూదా ఇవి కొత్త నిబంధన సమయాల్లో ఇశ్రాయేలు మూడు ముఖ్య పరగణాలు.
  • గలిలయ సరిహద్దులో తూర్పున పెద్ద సరస్సు "గలిలీ సరస్సు" ఉంది.
  • యేసు గలిలయ ఊరు నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాడు, నివసించాడు.
  • ఎక్కువ అద్భుతాలు, బోధలు యేసు గలిలయప్రాంతం లోనే చేశాడు.

(చూడండి: నజరేతు, సమరయ, గలిలీ సరస్సు)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు:

  • 21:10 ప్రవక్త యెషయా చెప్పాడు. మెస్సియా గలిలయలో, నివసించి గుండె చెదిరిన ప్రజలకు ఆదరణనిస్తూ, బందీలకు స్వాతంత్ర్యం ప్రకటిస్తూ తిరుగుతాడు.
  • 26:01 తరువాత సాతాను శోధనలను జయించి యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్లి అక్కడ నివసించాడు.
  • 39:06 చివరకు ఆ మనిషి చెప్పాడు, "ఇప్పుడు నువ్వు యేసుతో ఉన్నావని నాకు తెలుసు, ఎందుకంటే నీవు కూడా గలిలయ వాడివే."
  • 41:06 తరువాత దేవదూత ఆ స్త్రీలకు చెప్పాడు. "వెళ్లి నా శిష్యులకు చెప్పండి, 'యేసు చావు నుండి తిరిగి లేచి మీకంటే ముందు గలిలయ కు వెళ్తాడు."

పదం సమాచారం:

  • Strong's: H1551, G1056, G1057