te_tw/bible/kt/reconcile.md

3.3 KiB

పునరుద్దరించుట, పునరుద్ధరించును, పునరుద్ధరించబడెను, సమాధానపరచబడుట

నిర్వచనము:

“పునరుద్దరించుట” మరియు “సమాధానపరచబడుట” అనే ఈ రెండు మాటలు శత్రువులుగా భావించుకొనే ఇద్దరు వ్యక్తుల మధ్యన “సమాధానపరచుటను” సూచించును. “సమాధానపరచుట” అనగా సమాధానపరిచే క్రియయైయున్నది.

  • పరిశుద్ధ గ్రంథములో ఈ పదము సాధారణముగా దేవుడు తననుతాను తన ప్రజలతో తన కుమారుడైన యేసు క్రీస్తు బలియాగము ద్వారా సమాధానపరచుకొనును.
  • పాపమునుబట్టి మనుష్యులందరు దేవుని శత్రువులైయున్నారు. అయితే ఆయన కనికర ప్రేమనుబట్టి, దేవుడు యేసు ద్వారా తనతో సమస్త జనములు సమాధానపరచబడు మార్గమును అనుగ్రహించియున్నాడు.
  • వారి పాపములకు క్రయధనముగా యేసు బలియాగమునందు నమ్మికయుంచుట ద్వారా ప్రజలందరు క్షమాపణ పొందుదురు మరియు దేవునితో సమాధానమును కలిగియుందురు.

తర్జుమా సలహాలు:

  • “పునరుద్ధరిద్దరించబడుట” అనే ఈ మాటను “సమాధానపరచుట” లేక “సరియైన మంచి సంబంధములను పునర్మించుట” లేక “స్నేహితులగుటకు కారణమగుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “సమాధానపరచబడుట” అనే ఈ పదమును “సరియైన సంబంధములను పునర్మించుట” లేక “సమాధానపరచుట” లేక “శాంతికరమైన విషయాలకు కారణమగుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: సమాధానము, బలియాగము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2398 , H3722 , G604 , G1259 , G2433 , G2643, G2644