te_tw/bible/kt/peopleofgod.md

4.7 KiB

దేవుని ప్రజలు, నా ప్రజలు

నిర్వచనము:

“దేవుని ప్రజలు” అనే మాట దేవునితో ప్రత్యెకమైన సహవాసము చేయుటకు లోకములోనుండి ఆయన పిలుచుకొనిన ప్రజలను సూచిస్తుంది.

  • “నా జనులు” అని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఎన్నుకొనిన ప్రజలను గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు మరియు ఆయనతో సంబంధమును కలిగియున్నవారిని గూర్చి మాట్లాడుచున్నాడు.
  • దేవుని ప్రజలు ఆయన ద్వారా ఎన్నుకొనబడినవారు మరియు ఆయనను మెప్పించే విధానములో జీవించుటకు లోకములోనుండి ప్రత్యేకించబడినవారు. ఆయన వారిని తన పిల్లలనియూ పిలుస్తాడు.
  • పాతనిబంధనలో “దేవుని ప్రజలు” అనే మాట దేవుని ద్వారా ఎన్నుకొనబడిన ఇశ్రాయేలు జనాంగమును సూచిస్తుంది మరియు ఆయనకు లోబడుటకు, ఆయనను సేవించుటకు లోక దేశములలోనుండి ప్రత్యేకించబడిన జనములను సూచిస్తుంది.
  • క్రొత్త నిబంధనలో “దేవుని ప్రజలు” అనే మాట విశేషముగా యేసునందు విశ్వాసముంచినవారిని మరియు సంఘము అని పిలువబడినవారిని సూచిస్తుంది. ఇందులో యూదులు మరియు అన్యులు కూడా ఉంటారు.

తర్జుమా సలహాలు:

  • “దేవుని ప్రజలు” అనే మాటను “దేవుని ప్రజలు” లేక “దేవునిని ఆరాధించే ప్రజలు” లేక “ దేవునిని సేవించే ప్రజలు” లేక “దేవునికి సంబంధించిన ప్రజలు” అని తర్జుమా చేయవచ్చును.
  • “నా ప్రజలు” అని దేవుడు చెప్పినప్పుడు, దీనిని తర్జుమా చేయు వేరొక విధానములో “నేను ఎన్నుకొనిన ప్రజలు” లేక “నన్ను ఆరాధించు ప్రజలు” లేక “నాకు సంబంధించిన ప్రజలు” అనే మాటలు కూడా వాడబడుతాయి.
  • అదేవిధముగా, “మీ జనులు” అనే మాటను “మీకు సంబంధించిన ప్రజలు” లేక “మీకు సంబంధించియుండుటకు మీరు ఎన్నుకొనిన జనులు” అని తర్జుమా చేయవచ్చును.
  • “ఆయన ప్రజలు” అను మాటను కూడా “ఆయనకు సంబంధించిన ప్రజలు” లేక “ఆయనకు సంబంధించియుండుటకు దేవుడు ఎన్నుకొనిన ప్రజలు” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదాలను కూడా చూడండి: ఇశ్రాయేలు, జనాంగము)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H430, H5971, G2316, G2992