te_tw/bible/kt/gentile.md

2.5 KiB

యూదేతరుడు, యూదేతరులు

వాస్తవాలు:

"యూదేతరుడు" అంటే యూదుడు కాని వాడు. యూదేతరులు అంటే యాకోబు సంతానం కానీ వారు.

  • బైబిల్లో, యూదేతరులను "సున్నతి లేని" అని అలంకారికంగా అంటారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు చేసినట్టుగా వారిలో అనేక మంది వారి మగపిల్లలకు సున్నతి చేయరు.
  • దేవుడు ఎన్నుకొన్న యూదులు అయన ప్రత్యేక ప్రజ. వీరు యూదేతరులను బాహ్యులుగా, దేవుని ప్రజలు కాని వారుగా ఎంచారు.
  • యూదులను "ఇశ్రాయేలీయులు” లేక “హెబ్రీయులు" అని ఆయా సమయాల్లో పిలిచారు. వారు ఇక మిగతా వారందరినీ "యూదేతరులు" అని పిలిచారు.
  • యూదేతరుడు అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "యూదుడుకాని వాడు” లేక “ఇశ్రాయేలు జాతికి చెందని వాడు" (పాత నిబంధన".
  • సాంప్రదాయికంగా, యూదులు యూదేతరులతో కలవరు, కలిసి భోజనం చెయ్యరు. ఇది ఆది సంఘంలో సమస్యలకు కారణం అయింది.

(చూడండి: ఇశ్రాయేలు, యాకోబు, యూదుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1471, G1482, G1484, G1672