te_tw/bible/kt/command.md

3.3 KiB

ఆజ్ఞాపించు, ఆజ్ఞ

నిర్వచనం:

"ఆజ్ఞాపించు" పదం అంటే ఎవరినైనా ఏదైనా చెయ్యమని చెప్పడం. "ఆజ్ఞ” ఒక వ్యక్తిని చెయ్యమని చెప్పిన విషయాన్ని సూచిస్తుంది.

  • "ఆజ్ఞ" పదం కొన్నిసార్లు దేవుని నిర్దిష్ట ఆజ్ఞలను సూచిస్తున్నాయి, అవి "పది ఆజ్ఞలు" మాదిరిగా క్రమబద్ధమైనవిగానూ, శాశ్వతమైనవిగానూ ఉన్నాయి.
  • ఒక ఆజ్ఞ నిశ్చయార్ధకంగా ఉండవచ్చు ("నీ తల్లి దండ్రులను సన్మానించుము) లేదా వ్యతిరేకార్ధకంగా ఉండవచ్చు ("దొంగిలించ వద్దు").
  • "ఆధిపత్యం తీసుకోండి" అంటే దేని విషయంలోనైనా లేదా ఎవరివిషయంలోనైనా "అధికారం తీసుకోవడం" లేదా "బాధ్యత తీసుకోవడం" అని అర్థం.

అనువాదం సూచనలు:

  • "చట్టం" వంటి పదానికి భిన్నంగా ఈ పదాన్ని అనువదించడం మంచిది. దీనిని "శాశనం," "కట్టడ" పదాల నిర్వచనాలతో పోల్చడం మంచిది.
  • కొందరు అనువాదకులు "ఆజ్ఞాపించు” మరియు "ఆజ్ఞ" పదాలను తమ భాషలో ఒకే పదంతో అనువదించడానికి యెంచుకొంటారు.
  • దేవుడు చేసిన క్రమబద్దమైన, శాశ్వతమైన ఆజ్ఞలను సూచించే “ఆజ్ఞ” పదం కోసం ఒక ప్రత్యేక పదాన్ని ఉపయోగించడానికి ఇతరులు యెంచుతారు.

(చూడండి: శాశనం, కట్టడ, చట్టం, పది ఆజ్ఞలు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H559, H560, H565, H1696, H1697, H1881, H2706, H2708, H2710, H2941, H2942, H2951, H3027, H3982, H3983, H4406, H4662, H4687, H4929, H4931, H4941, H5057, H5713, H5749, H6213, H6310, H6346, H6490, H6673, H6680, H7101, H7218, H7227, H7262, H7761, H7970, H8269, G1263, G1291, G1296, G1297, G1299, G1690, G1778, G1781, G1785, G2003, G2004, G2008, G2036, G2753, G3056, G3726, G3852, G3853, G4367, G4483, G4487, G5506