te_tw/bible/kt/antichrist.md

3.6 KiB

క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధులు

నిర్వచనం:

ఈ పదం "క్రీస్తు విరోధి" యేసు క్రీస్తుకు, అయన పనికి వ్యతిరేకంగా ఉండే ఒక వ్యక్తిని లేక బోధను సూచిస్తుంది. లోకంలో అనేకమంది క్రీస్తు విరోధులు ఉన్నారు.

  • యేసు మెస్సియా కాదని చెబుతూ, యేసు ఒకే సమయంలో దేవుడు, మానవుడు కూడా అనే సత్యాన్ని నిరాకరిస్తూ మనుషులను మోసం చేస్తూ ఉండే వ్యక్తి క్రీస్తు విరోధి అని అపోస్తలుడు యోహాను రాశాడు.
  • క్రీస్తు విరోధి ఆత్మ లోకంలో నెలకొని అయన పనిని వ్యతిరేకిస్తున్నదని బైబిల్ బోధిస్తున్నది.
  • కొత్త నిబంధనలో ప్రకటన పుస్తకం "క్రీస్తు విరోధి"అని పేరుగల మనిషి అంత్య కాలంలో వెల్లడి అవుతాడని వర్ణిస్తున్నది. ఈ మనిషి దేవుని ప్రజలను నాశనం చేయబూనుకుంటాడనీ, అయితే అతడు యేసు చేతిలో ఓడిపోతాడని చెబుతున్నది.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్నిఅనువదించే ఇతర పద్ధతులు. ఒక పదం లేక పదబంధం ద్వారా "క్రీస్తు వ్యతిరేకి” లేక “క్రీస్తు శత్రువు” లేక “క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండేవాడు"అని రాయవచ్చు.
  • దీన్ని "క్రీస్తు విరోధి ఆత్మ"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండే ఆత్మ” లేక “(ఎవరికైనా) క్రీస్తును గురించి అసత్యాలు బోధించే” లేక “క్రీస్తును గురించి అబద్ధాలు నమ్మే ధోరణి” లేక “క్రీస్తును గురించి అబద్ధాలు బోధిస్తున్న ఆత్మ."
  • అంతేగాక ఈ పదాన్ని స్థానిక, జాతీయ భాష బైబిల్ అనువాదంలో అనువదించడం ఎలా అనేది చూడండి.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: క్రీస్తు, వెల్లడించు, హింసలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G500