te_tw/bible/kt/amen.md

4.3 KiB

ఆమేన్, నిజంగా

నిర్వచనం:

"ఆమేన్"అనే ఈ పదం ఒక వ్యక్తి చెప్పిన దానిని నొక్కి చెప్పడానికి, లేక దాని వైపు ధ్యాస మళ్ళించడానికి ఉపయోగించేది. దీన్ని తరచుగా ప్రార్థన చివర్లో పలుకుతారు. కొన్ని సార్లు దీన్ని"నిజంగా" అని అనువదించవచ్చు.

  • ప్రార్థన చివర్లో "ఆమేన్" చెబితే ఆ ప్రార్థనతో ఏకీభావం లేక ఆ ప్రార్థన నెరవేరాలన్న అభిలాష వ్యక్తం అవుతుంది.
  • తన ఉపదేశంలో యేసు "ఆమేన్" అనే మాటను తాను చెప్పిన ఒక సత్యాన్ని నొక్కి చెప్పడానికి ఉపయోగించాడు.

అయన తరచుగా ఈ మాట తరువాత "మీతో నేను అంటున్నాను"అనే మాటలు పలకడం ద్వారా ఇంతకు ముందు బోధకు అదనంగా దానికి సంబంధించి చేర్చదలచిన బోధ చెబుతాడు.

  • యేసు "ఆమేన్"ను ఈ విధంగా ఉపయోగించిన చోట కొన్ని అంగ్ల అనువాదాల్లో (యు ఎల్ బి) "నిశ్చయంగా” లేక “నిజంగా” అని దీన్ని అనువదించడం జరిగింది.
  • మరొక పదం అర్థం "నిజంగా" అని కొన్ని సార్లు అనువదించడం చూడవచ్చు. "తప్పక” లేక “తప్పనిసరిగా"అని ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని నొక్కి చెప్పడానికి ఉపయోగించేవారు.

అనువాదం సలహాలు:

  • లక్ష్య భాషలో ఏదైనా ఒక ప్రత్యేక పదం లేక పదబంధం నొక్కి చెప్పడానికి ఉపయోగించేది ఉందేమో చూడండి.
  • ఒక ప్రార్థన చివర్లో లేక ఒకదాన్ని నిర్ధారించడానికి ఉపయోగిస్తే, "ఆమేన్" అని తర్జుమా చెయ్యవచ్చు. "అలా అగుగాక” లేక “ఆ విధంగా జరుగు గాక” లేక “అది నిజం."
  • యేసు, "నిజంగా చెబుతున్నాను," అన్నప్పుడు ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అవును నేను యథార్థంగా చెబుతున్నాను.” లేక “అది నిజం, నేను కూడా చెబుతున్నాను."
  • "నిజంగా, నిజంగా నీకు చెబుతున్నాను"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దీన్ని యథార్థంగా చెబుతున్నాను.” లేక “మనస్పూర్తిగా చెబుతున్నాను” లేక “నేను మీకు చెబుతున్నది నిజం."

(చూడండి: నెరవేర్చు, నిజం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H543, G281