te_tw/bible/kt/adoption.md

3.4 KiB

దత్తత, దత్తత తీసుకొను, దత్తత తీసుకొన్న

నిర్వచనం:

"దత్తత తీసుకొను,""దత్తత"అంటే శారీరిక తల్లిదండ్రులు కాని వారికి చట్టబద్ధంగా పిల్లలు కావడం.

  • బైబిల్ "దత్తత," "దత్తత తీసుకొను" అనే మాటలను అలంకారికంగా దేవుడు కొందరిని తన కుటుంబంలో సభ్యులుగా చేసి వారిని తన ఆత్మ సంబంధమైన కుమారులు, కుమార్తెలుగా చేసే ప్రక్రియకు వాడతారు.
  • దత్తత తీసుకొన్న పిల్లలుగా, దేవుడు విశ్వాసులను యేసు క్రీస్తు సహ వారసులుగా చేసి, వారికి దేవుని కుమారులకు, కుమార్తెలకు ఉండే అధిక్యతలు కలిగిస్తాడు.

అనువాదం సలహాలు:

  • అనువాద భాషలో ఒక ప్రత్యేక తండ్రి పిల్లల అనుబంధాన్ని తెలిపే పదంతో ఈ పదాన్ని అనువదించ వచ్చు.

అది అలంకారికంగా, లేక ఆత్మ సంబంధమైన అర్థంతో వాడిన మాట అని అర్థం అయ్యేలా జాగ్రత్త పడు.

  • "దత్త కుమారులుగా" అనే మాటను ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుడు తన పిల్లలుగా దత్తత తీసుకొన్న వారుగా” లేక “దేవుని (ఆత్మ సంబంధమైన ) పిల్లలుగా."
  • "దత్తత అయిన కుమారులుగా ఉండడానికి ఎదురు చూచు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుని పిల్లలుగా కావడానికి కనిపెట్టు” లేక “దేవుడు తన పిల్లలుగా స్వీకరించడం కోసం వేచి ఉండు."
  • "వారిని దత్తత తీసుకొను"అనే మాటను ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "తన స్వంత పిల్లలుగా వారిని చేసుకునేలా” లేక “వారిని తన (ఆత్మ సంబంధమైన ) పిల్లలుగా చేసుకునేలా."

(చూడండి: వారసుడు, వారసత్వముగా పొందు, ఆత్మ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G5206