te_ta/translate/translate-process/01.md

1.2 KiB

ఏ విధంగా అనువదించాలి

అనువాదం చేయడానికి రెండు విషయాలు ఉన్నాయి:

  1. మూలభాషకు సంబంధించి గ్రంధంలో ఉన్న అర్థాన్ని కనుగొనడం (చూడండి: మూలగ్రంధంలోని అర్థాన్ని కనుగొనండి)
  2. అనువాదం కోసం లక్ష్యంగా ఎంచుకున్న భాషలోని అర్థాన్ని తిరిగి చెప్పడం (చూడండి: అర్థాన్నితిరిగి చెప్పడం)

కొన్నిసార్లు అనువాదం కోసం చేసే సూచనలు ఈ రెండు విషయాలను చిన్న దశలుగా విభజిస్తాయి. ఈ దిగువ ఇచ్చిన గ్రాఫిక్, ఈ రెండూ అనువాద ప్రక్రియలకు ఎలా సరి పోతాయో చూపిస్తుంది.