te_ta/translate/translate-retell/01.md

4.7 KiB

అర్థాన్నిఎలా తిరిగి చెప్పాలి

ఈ క్రింద ఒక నిర్దేశించిన దశల జాబితా ఉంది. ఈ దశల ఉద్దేశ్యం సహజమైన, అర్థవంతమైన, కచ్చితమైన అనువాదాన్ని రూపొందించడంలో సహాయ పడుతుంది. అత్యంత సాధారణ అనువాదకులు చేసే తప్పులలో ఒకటి, సందర్భానుసారమైన భాషలో సహజ రూపాలను ఉపయోగించి పొందికైన వచనాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమవడం. ఈ దశలను అనుసరించడం ద్వారా, అనువాదకులు మరింత సహజమైనా, మరింత అర్థవంతమైన అనువాదాన్నికనపరుస్తారు.

  1. ఎంచుకున్న మొత్తం భాగాన్ని మూలభాషలో చదవండి. గ్రంధంలో ఊదహరించిన ఒక భాగంలో కొన్ని వాక్యాల సముదాయమూ, లేదా కథలో జరిగిన ఒక విషయం, లేదా మొత్తం భాగమంతా కావచ్చు (కొన్ని బైబిలులలో, మొదట భాగానికి రాసి ఉన్న శీర్షిక నుండి తదుపరి శీర్షిక వరకు ఉన్న ప్రతి విషయం). కష్టమైన వచనంలో ఉన్న ఒక భాగం ఒకటి లేదా రెండు వచనాలు మాత్రమే కావచ్చు.
  2. మూల భాషలోని వాక్యాన్ని చూడకుండా, సందర్భానుసారంగా వాడుక భాషలోనే చెప్పండి. మీరు కొన్ని భాగాలను మరచి పోయినప్పటికీ, మీకు గుర్తున్న విషయాన్నే చివరి వరకు చెప్పడం కొనసాగించండి.
  3. తిరిగి మూలభాషలోని వచనాన్ని చూడండి. ఇప్పుడు తిరిగి లక్ష్యoగా ఎంచుకొన్న భాషలో ప్రతి దానిని చెప్పండి.
  4. తిరిగి మీరు మూలభాషలోని వాక్యాన్ని చూస్తూ, మీరు మరచిన భాగాలపై మాత్రమే దృష్టి పెట్టి, వాటిని జ్ఞాపకం చేసుకోవడంతో మీరు లక్ష్యoగా ఎంచుకొన్న భాషలో తిరిగి చెప్పండి.
  5. గ్రంధంలో ఊదహరించిన భాగాన్నంతటిని గుర్తు చేసుకున్న తరువాత, తిరిగి దానిని స్మరణకు తెచ్చుకుంటూ ఖచ్చితంగా రాయండి.
  6. రాసిన తర్వాత, మీరు వదిలేసిన కొన్నివిషయాలు తెలుసు కోడానికి మూలభాషను చూడండి. అటువంటి విషయలేమైన ఉంటే ప్రాముఖ్యమైన చోట ఉంచండి.
  7. మీకు మూల వాక్యంలో ఏదైనా అర్థం కాకపోతే, '[అర్థంకాలేదు]' అనువాదంలోకి రాసి, మిగిలిన భాగాన్ని రాయడం కొనసాగించండి.
  8. ఇప్పుడు, మీరు రాసిన దానిని చదివి, మీకు అర్థమైందో లేదో అంచనా వేసి, మెరుగు పరచాల్సిన భాగాలను నిర్ణయించండి.
  9. తరవాత భాగానికి వెళ్ళండి. దానిని మూలభాషలో చదవండి. 2 నుండి 8 వరకు ఉన్న దశలను కచ్చితంగా అనుసరించండి.
  • క్రెడిట్స్: అనుమతితో ఉపయోగించడం జరిగింది, © 2013, SIL ఇంటర్నేషనల్, షేరింగ్ అవర్ నేటివ్ కల్చర్, పి. 59. *