te_ta/translate/figs-you/01.md

3.5 KiB
Raw Permalink Blame History

ఏకవచనం, ద్వివచనం, మరియు బహువచనం

“మీరు”అనే పదం ఎంత మంది వ్యక్తులను సూచిస్తుందనే మీద ఆధారపడి కొన్ని భాషలలో “మీరు”పదం కోసం ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి. ఏకవచనం రూపం ఒక వ్యక్తిని సూచిస్తుంది, మరియు బహువచనం రూపం ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులను సూచిస్తుంది. కొన్ని భాషలలో ద్వివచనం రూపం కూడా ఉంది, ఇది ఇద్దరు వ్యక్తులను సూచిస్తుంది, మరియు కొన్ని భాషలలో ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులను సూచించే ఇతర రూపాలు ఉన్నాయి.

మీరు http://ufw.io/figs_younum నందు వీడియోను కూడా చూడవచ్చు.

కొన్నిసార్లు బైబిలులో ఒక వక్త సమూహంతో మాట్లాడుతున్నప్పటికీ “మీరు” అనే ఏకవచనం రూపాన్నే ఉపయోగిస్తాడు.

సాంప్రదాయక మరియు అసాంప్రదాయక

కొన్ని భాషలలో వక్తకూ మరియు అతను మాట్లాడుతున్న వ్యక్తికీ మధ్య ఉన్న సంబంధం ఆధారంగా “మీరు” యొక్క రూపాలు ఒకటి కంటే ఎక్కువ రూపాలు ఉన్నాయి. ప్రజలు తమకంటే పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు లేదా ఉన్నత అధికారితో మాట్లాడుతున్నప్పుడు లేదా తమకు బాగా తెలియని వారితో మాట్లాడుతున్నప్పుడు లేదా అధిక అధికారం ఉన్న వారితో మాట్లాడేటప్పుడు “మీరు” పదంలోని సాంప్రదాయక రూపాన్ని ఉపయోగిస్తారు. పెద్దవారు కానివారు లేదా ఉన్నత అధికారం లేనివారు లేదా కుటుంబ సభ్యుడు లేదా సన్నిహిత స్నేహితులతో మాట్లాడేటప్పుడు ప్రజలు సాంప్రదాయక రూపాన్ని వినియోగిస్తారు.

వీడియోను http://ufw.io/figs_youform లో మీరు చూడవచ్చు.

వీటిని అనువదించడంలో సహాయం కోసం, మీరు చదవమని మేము సూచిస్తున్నాము: