te_ta/intro/translation-guidelines/01.md

11 KiB

  • ఈ పత్రం అధికారిక ప్రతి లభ్యమయ్యే చోటు http://ufw.io/సూచనలు/.*

  • అనువాదంలో వాడే సూత్రాలనూ, ప్రక్రియలనూ సూచించే ఈ ప్రకటనను అన్ ఫోల్దింగ్ వర్డ్ ప్రాజెక్టులో భాగస్తులుగా ఉన్న అన్ని సంస్థలు, రచనలో పాల్గొన్న రచయితలు అందరూ ఆమోదించారు. ( https:// unfoldingword.bible చూడండి ). అనువాద కార్యకలాపాలన్నీ ఈ ఉమ్మడి సూచనల ఆధారంగానే జరుగుతాయి.*

  1. శుద్ధమైన — శుద్ధమైన రీతిలో అనువాదం చెయ్యండి. మూల వాచకం శైలినుండి తొలగిపోకుండా మూలంలో ఉన్న అర్థాన్ని మార్చకుండా, దానికి ఏమీ కలపకుండా తర్జుమా చెయ్యండి. తర్జుమా చేసిన విషయం మూల వాచకంలో ఉన్న దానిని ఎంత నమ్మకంగా వీలైతే అంత నమ్మకంగా కచ్చితంగా వెల్లడి చెయ్యాలి. అంటే మూలం చదివిన వారికి ఎలా అర్థం అయిందో దానికి సాధ్యమైనంత దగ్గరగానన్న మాట. (చూడండిఅర్థవంతమైన అనువాద సృష్టి)
  2. స్పష్టమైన — సాధ్యమైనంత అవగాహన సృష్టించడం కోసం ఎలాంటి భాషా నిర్మాణం అవసరమో దాన్ని వాడండి. మూల వాచకంలోని భావాన్ని సాధ్యమైనంత స్పష్టంగా వెల్లడి చేసేందుకు అందులో కనిపించే ఆకృతిని కూర్పును మార్చడం గానీ అవసరమైన మేరకు ఎక్కువ, లేక తక్కువ పదాలు వాడడం గానీ చెయ్యండి. (చూడండిఅర్థవంతమైన అనువాద సృష్టి)
  3. సహజ — మీ భాష వాడకంలో ఆయా సందర్భాల్లో సహజ రీతిని ప్రతిబింబించే శక్తివంతమైన భాషా శైలులను ఉపయోగించండి. (చూడండిసహజ అనువాద సృష్టి)
  4. మూల విధేయ — మీ అనువాదంలో ఏ విధమైన రాజకీయ, వర్గ సంబంధమైన, భావజాలపరమైన పక్షపాతం లేకుండా చూసుకోండి. మూల బైబిల్ భాషల్లోని పదజాలానికి విధేయమైన కీలక పదాలనే వాడండి.. తండ్రియైన దేవునికీ కుమారుడైన దేవునికీ ఉన్న సంబంధాన్ని వర్ణించడానికి బైబిల్ పదాలకు సమానార్థకమైన సామాన్య పదాలనే వాడండి. అవసరమైన చోట ఫుట్ నోట్ ల సాయంతో ఇతర అనుబంధ వనరుల సాయంతో స్పష్టికరించ వచ్చు.(చూడండి మూల విధేయ అనువాద సృష్టి)
  5. *అధికారికమైన — మూల భాష బైబిల్ వాచకాలను అనువాదానికి అత్యున్నత అధికారంగా ఎంచి ఉపయోగించండి. ఇతర భాషల్లోని ఆధారపడదగిన బైబిల్ సమాచారాలను మధ్యంతర వాచకాలుగా స్పష్టికరణ కోసం వడ వచ్చు (చూడండిఅధికారిక అనువాద సృష్టి)
  6. చారిత్రాత్మకమైన — చారిత్రాత్మక సంఘటనలను వాస్తవాలను శుద్ధ రీతిలో తెలియజేయండి. మూల వాచకాలను అందుకున్న మొదటి చదువరులకు ఉద్దేశించిన సందేశాన్ని వారిని పోలిన స్థితిగతులు సందర్భాలు లేని నేటి చదువరులకు అర్థమయ్యేలా చెయ్యడానికి అవసరమైన అదనపు సమాచారం ఇవ్వాలి. (చూడండిచారిత్రాత్మక అనువాద సృష్టి)
  7. సమానార్థక — మూల వాచకంలో ఉన్న సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందులోని భావావేశాలు, ప్రవృత్తులు వ్యక్తమయ్యేలా తర్జుమా చెయ్యండి. సాధ్యమైనంతవరకు మూల వాచకంలోని వివిధ సాహిత్య రీతులను, అంటే కథనం, పద్యం, హెచ్చరిక వాక్కులు, ప్రవచనం మొదలైన వాటిని మీ భాషలో సమానార్థకమైన విధానంలో సరిపోయిన శైలిలో తర్జుమా చెయ్యండి. (చూడండిసమానార్థక అనువాద సృష్టి)

అనువాద నాణ్యతను గుర్తించడం, నిర్వహించడం

అనువాదం నాణ్యత సాధారణంగా అనువాదం మూల అర్థానికి ఎంత వరకు విధేయంగా ఉన్నదనే దాన్ని సూచించేది. అంతేగాక అనువాదం ఎంత సులభంగా అర్థం అవుతున్నది, లక్ష్య భాష మాట్లాడే వారికి ఏ మేరకు ఉపయోగపడుతున్నది అనే దాన్ని గురించినది. మేము సూచిస్తున్న వ్యూహం లక్ష్య భాష మాట్లాడే సమూహం యొక్క భాషాభాగాలను, భావప్రసరణ రీతులను సరి చూసుకుంటూ వెళ్ళడం, అదే సమయంలో అనువాదం ఆ ప్రజా సమూహంలోని సంఘానికి విధేయంగా ఉండాలి..

ఇలా చెయ్యడంలో ఇదమిద్ధమైన దశలు రకరకాలుగా ఉండవచ్చు. అవి అనువాద భాష పైనా అనువాద ప్రాజెక్టు సందర్భం పైనా ఆధారపడి ఉంటాయి. సాధారణంగా లక్ష్య భాష మాట్లాడే వారు, ఆ భాషాసమూహం లో ఉన్న సంఘ నాయకత్వం తనిఖీ చేసిన దాన్ని మంచి అనువాదం అనవచ్చు:

  1. శుద్ధం, స్పష్టం, సహజం, సమానార్ధకం — మూల భాషలో ఉద్దేశించిన భావానికి అనుగుణంగా ఉండి, ఆ ప్రజా సమూహంలోని సంఘం ఆమోదం కలిగి, భౌగోళిక, చారిత్రాత్మక సంఘంతో అనుగుణంగా ఉంది తద్వారా :
  2. *సంఘ ఆమోద ముద్ర పొందిన - సంఘం ధృవీకరణ పొంది సంఘం వాడుకుంటున్న అనువాదం. (చూడండిసంఘ ఆమోదిత అనువాదసృష్టి)

అనువాదం పని ఈ క్రింది విధంగా కూడా ఉండాలని మేము సలహా ఇస్తున్నాము:

  1. సహకారిక — సాధ్యమైనంతవరకూ మీ భాష మాట్లాడే ఇతర విశ్వాసులతో కలిసి తర్జుమా, తనిఖీ, పంపిణి పని చేయండి. ఎంత మందికి వీలైతే అంతమందికి అందుబాటులో ఉండేలా ఎంత నాణ్యత వీలైతే అంత నాణ్యత ఉండేలా చూడండి. (చూడండి సహకారిక అనువాదసృష్టి)
  2. నిరంతరాయ — అనువాదం పని ఎన్నటికీ పూర్తి కాదు. భాషా ప్రవీణులను అనువాదంలో మరింత మెరుగైన రీతిలో సమాచారం చేరవేయడానికి, తర్జుమాకు మెరుగులు దిద్దడానికి సలహాలు ఇమ్మని చెప్పండి. అనువాదదోషాలను కనిపించినప్పుడల్లా సరిదిద్దాలి. అంతేకాక అప్పుడప్పుడూ అనువాదాన్ని సమీక్షించుకుంటూ ఒక వేల నూతన అనువాదం, లేదా అనువాదం పునర్విమర్శ అవసరమేమో చూసుకోవాలి. ప్రతి భాషా సమూహంలోను అనువాద కమిటీ ఒకటి ఉండి ఈ పనిని నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ ఉండాలని మా అభిప్రాయం. అన్ ఫోల్దింగ్ వర్డ్ ఆన్ లైన్ పరికరాలను ఉపయోగించుకుని అనువాదానికి మార్పులు, చేర్పులు త్వరగా సులభంగా చేస్తుండవచ్చు. (చూడండినిరంతరాయ అనువాదసృష్టి)