te_tw/bible/other/yeast.md

5.8 KiB
Raw Permalink Blame History

పులిపిండి, పులిసిన, పులియబెట్టుట, పులియబెట్టబడిన, పులవని

నిర్వచనము:

రొట్టెలు చేసే పిండి పోగుటకు ఉపయోగించే పదార్థమును “పులియబెట్టు పదార్థము” అని సహజముగా అంటారు. “పులిపిండి” అనేది పులియబెట్టు పదార్ధములలో ఒక రకమైన పదార్తమైయున్నది.

  • కొన్ని ఆంగ్లేయ అనువాదములలో, పులియబెట్టు పదార్థమునకు “పులిపిండి” అని ఉపయోగించియున్నారు. ఇది రొట్టెలు చేయు పిండి పొంగేందుకు సహాయపడుతుంది మరియు అందులో గాలి బుడగాలను నింపుతుంది. ఇది పులియబెట్టే పద్ధతులలో ఒక ఆధునికమైన పదార్తమైయున్నది. పిండి అంతటా చేరేవిధముగా పిండి కలుపుచున్నప్పుడు దానిలో పులిపిండిని జతచేసి కలుపుతారు.
  • పాత నిబంధన కాలములో, పిండి పులవడానికి దానిని కొంత సమయము వరకు నానబెట్టేవారు. క్రొత్త పిండిని పులవబెట్టడానికి పాత పిండిలో నుండి కొంత తీసి నిలువ చేసేవారు.
  • ఐగుప్తు దేశమునుండి ఇశ్రాయేలీయులు తప్పించుకొని బయటకు వెళ్ళినప్పుడు, పిండి పులువబెట్టుటకు వారికి సమయము లేక పోయెను, అందువలన వారు పులవని పిండితో తమ ప్రయాణమునకు కావలిసిన రొట్టెలను సిద్దపరచుకొన్నారు. దీనిని జ్ఞాపకము చేసుకోవడానికి, యూదులు ప్రతి సంవత్సరం పులవని రొట్టెలను భుజించడం ద్వారా పస్కా పండుగను ఆచరిస్తున్నారు. ఒకని జీవితములో పాపము ఏ విధముగా వ్యాపిస్తుందో లేక పాపము ఏ రీతిగా ఇతరులను ప్రేరేపించవచ్చో అని తెలియజేయుటకు బైబిలు గ్రంథములో పలుమార్లు “పులవబెట్టుట” లేక “పులిపిండి” అనే పదము ఉపయోంచబడియున్నది.
  • అతి త్వరగా వ్యాపించే అబద్ధపు బోధలను మరియు దాని ద్వారా ప్రభావితమైన ప్రజలను సూచించుటకు కూడా ఈ పదము ఉపయోగించబడియున్నది.
  • దేవుని రాజ్యము ఒకని నుండి మరియొకనికి ఏ రీతిగా వ్యాపించునో అని సూచించడానికి కూడా “పులియబెట్టు పదార్థము” అనే పదమును అనుకూలంగా ఉపయోగించవచ్చును.

అనువాదం సలహాలు:

  • ఈ పదమును “పులియబెట్టుట” లేక “పిండిని పులవబెట్టుటకు వాడు పదార్థము” లేక “పొంగిచు పదార్థము” అని తర్జుమా చేయవచ్చును. “పొంగు” అనే పదమును “పెద్దది చేయు” లేక “గాలి నింపబడుట” అని కూడా చెప్పవచ్చును.
  • ఒకవేళ స్థానికంగా రొట్టెలు చేసే పిండిని పులియబెట్టుటకు ఏదైనా పదార్థమును వాడుచునట్లయితే, ఆ పదమును వాడవచ్చును. “పులియబెట్టు పదార్థము” అని అర్థమిచ్చు విధముగా ఆయా భాషలలో ఉపయోగించే పదములను తర్జుమా చేయునప్పుడు ఉపయోగించడము ఉత్తమము.

(ఈ పదములను కూడా చూడండి: ఐగుప్తు, పస్క, పులియని రొట్టె)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H2556, H2557, H4682, H7603, G01060, G22190, G22200