te_tw/bible/other/word.md

3.6 KiB

వాక్యము, వాక్యములు

నిర్వచనము:

“వాక్యము” అనేది ఒక వ్యక్తి తన నోటినుండి పలికినదానిని సూచిస్తుంది.

  • దీనికి ఉదాహరణ ఏమనగా, “నా మాటలు నీవు నమ్మడము లేదు” అని దూత జెకర్యాతో చెప్పినప్పుడు, దాని అర్థము ఏమనగా “నేను చెప్పు సంగతులు నీవు నమ్ముటలేదు” అని అర్థము.
  • ఈ పదము కేవలము ఒక పదమునే లేక మాటనే కాకుండా పూర్తీ సందేశమంతటిని సూచిస్తుంది.
  • కొన్నిమార్లు “మాట” అనేది సాధారణముగా ప్రసంగమును సూచిస్తుంది, “మాటలోనూ మరియు క్రియలోను శక్తివంతముగా ఉంటుంది” అనగా “ప్రసంగములోను మరియు ప్రవర్తనలోను శక్తివంతముగా ఉంటుంది” అని అర్థము.
  • పరిశుద్ధ గ్రంథములో అనేకమార్లు “వాక్యము” అనేది దేవుడు చెప్పిన లేక ఆజ్ఞాపించిన ప్రతిదానిని సూచించుటకు ఉపయోగించబడియున్నది, ఉదాహరణకు “దేవుని వాక్కు” లేక “సత్య వాక్యము”.
  • ఈ పదము విశేషముగా ఉపయోగించబడినది ఎప్పుడనగా యేసును “వాక్యము” అని పిలువబడినప్పుడు. ఈ రెండు అర్థాల కొరకు దేవుని వాక్యము అనే పదమును చూడండి.

తర్జుమా సలహాలు:

  • “వాక్యము” లేక “వాక్యములు” అనే పదాలను తర్జుమా చేయు ఇతరతా విధానములలో “బోధన” లేక “సందేశము” లేక “వార్తలు” లేక “పలుకు” లేక “చెప్పబడినది” అని కూడా ఉపయోగించుదురు.

(ఈ పదాలను కూడా చూడండి: దేవుని వాక్యము)

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H561, H562, H565, H1697, H1703, H3983, H4405, H4406, H6310, H6600, G518, G1024, G3050, G3054, G3055, G3056, G4086, G4487, G4935, G5023, G5542