te_tw/bible/other/veil.md

3.2 KiB

ముసుగు, ముసుగులు, ముసుగు వేయబడిన , ముసుగు వేయబడని

నిర్వచనము:

“ముసుగు” అనునది సాధారణముగా తల లేదా ముఖము కనబడకుండా కప్పుకొనుటకు ఉపయోగించే ఒక పలుచని బట్ట ముక్కగా చెప్పబడుచున్నది.

  • మోషే కూడా యెహోవా దేవుని సముఖములో నుండి వచ్చిన తరువాత తన ప్రకాశవంతమైన ముఖమును ప్రజలు చూడలేకపోయినందున తన ముఖమును కప్పుకొనెను.
  • బైబిలులో చూచినట్లయితే, స్త్రీలు తమ తలను కప్పుకొనుటకు ఈ ముసుగును ధరిస్తారు మరియు వారు బయటవున్నప్పుడు కానీ లేదా పురుషుల మధ్యలో వున్నప్పుడు కానీ ఎక్కువగా ముఖమును కప్పుకుంటారు.
  • “ముసుగు” అను మాట దేనినైనా కప్పడానికి ఉపయోగించే పైకప్పు అని అర్థమిచ్చుచున్నది.
  • కొన్ని ఆంగ్ల సంస్కరణలలో, “ముసుగు” అనే పదమును అతి పరిశుద్ధస్థలము యొక్క ప్రవేశద్వారమును కప్పుటకు ఉపయోగించు మందపాటి తెరగా చెప్పబడింది. సంధర్భాన్ని ఆధారం చేసుకొని “ తెర” అనేది ఒక బరువైన, దళసరి గుడ్డముక్కగా చెప్పబడుతుంది.

తర్జుమా సలహాలు

  • “ముసుగు” ఒక “పలుచని కప్పుకునే గుడ్డ ” లేదా “కప్పుకునే గుడ్డ” లేదా “తల ముసుగు” అని కూడా అనువదింపబడింది.
  • కొన్ని సంప్రదాయాలలో, స్త్రీలు ముసుగు వేసుకునే పద్దతి కలదు. ఇది మోషే గురించి ఉపయోగించారు కావున వేరొక పదాన్ని తెలుసుకోవడం కూడా అవసరమై ఉన్నది.

(దీనిని చూడండి: మోషే)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: H7289, G2665