te_tw/bible/other/tunic.md

2.5 KiB
Raw Permalink Blame History

లోపలి వస్త్రం

నిర్వచనం:

బైబిల్లో, "లోపలి వస్త్రం"అనేది పై బట్టల కింద చర్మానికి అనుకుని ఉండే వస్త్రం

  • లోపలి వస్త్రం భుజాలనుండి నడుము దాకా లేక మోకాళ్ళ దాకా ఉండవచ్చు. దీన్ని సాధారణంగా బెల్టుతో బిగిస్తారు. లోపలి వస్త్రం ధనికులు వేసుకుంటారు. కొన్ని సార్లు వీటికి పొడుగు చేతులు ఉంటాయి.
  • లోపలి వస్త్రం తోలుతో, వెంట్రుకలతో నేసిన గుడ్డతో, ఉన్నితో, లేక సన్న నార బట్టతో చేస్తారు. స్త్రీలు, పురుషులు కూడా ధరిస్తారు.
  • లోపలి వస్త్రం సాధారణంగా పొడవాటి పై వస్త్రం కింద ధరిస్తారు. వేడి ప్రదేశాల్లో లోపలి వస్త్రం కొన్ని సార్లు బయటి వస్త్రాలు లేకుండానే ధరిస్తారు.
  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పొడవైన చొక్కా” లేక “పొడవైన లోదుస్తులు” లేక “చొక్కా వంటి వస్త్రాలు." దీన్ని "లోపలి వస్త్రం," అని రాసి, ఇది ఏ బట్టతో నేసారో వివరించవచ్చు.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి:robe)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2243, H3801, H6361, G55090