te_tw/bible/other/submit.md

2.9 KiB
Raw Permalink Blame History

లోబడు, విధేయత, సమర్పణలో

నిర్వచనము:

“లోబడుట” అనే పదమునకు సహజముగా ఒక వ్యక్తి క్రిందగాని లేక ప్రభుత్వము క్రిందగాని తననుతాను స్వయముగా వెళ్లి అప్పగించుకొనుట అని అర్థము కలదు.

  • యేసును విశ్వసించే వారు తమ జీవితాల్లో దేవునికి మరియు ఇతర అధికారులకు లోబడాలని బైబిల్ చెబుతోంది.
  • “ఒకరికొకరు లోబడియుండుడి" అనే హెచ్చరిక దిద్దుబాటును వినయంగా అంగీకరించడం మరియు మన స్వంత అవసరాలపై కాకుండా ఇతరుల అవసరాలపై దృష్టి పెట్టడం అని అర్థం.
  • “విధేయతతో జీవించడం” అంటే ఏదైనా లేదా ఎవరికైనా అధికారం కింద తనను తాను ఉంచుకోవడం.

అనువాదం సూచనలు:

  • “లోబడు” అనే ఆదేశాన్ని “మిమ్మల్ని మీరు అధికారం క్రింద పెట్టుకోండి” లేదా “నాయకత్వాన్ని అనుసరించండి” లేదా “వినయంగా ఘనపరచండి మరియు గౌరవించండి"
  • “సమర్పణ” అనే పదాన్ని “విధేయత” లేదా “అధికారాన్ని అనుసరించడం” అని అనువదించవచ్చు.
  • “విధేయతతో జీవించు” అనే పదబంధాన్ని “విధేయతతో ఉండండి” లేదా “తనను తాను అధికారంలో ఉంచుకోండి” అని అనువదించవచ్చు.
  • “లోబడి ఉండండి” అనే పదబంధాన్ని “అధికారాన్ని వినయంగా అంగీకరించండి” అని అనువదించవచ్చు.

(ఈ పదములను కూడా చూడండి:subject)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H3584, G52260, G52930