te_tw/bible/other/rest.md

5.5 KiB
Raw Permalink Blame History

విశ్రాంతి, విశ్రాంతి పొందెను, విశ్రాంతి లేకపోవడం

నిర్వచనము:

“విశ్రాంతి” అనే పదమునకు సాధారణంగా  సేద తీర్చుకొనుటకు లేదా తిరిగి బలము పొందుకొను నిమిత్తము పనిచేయుటను నిలిపివేయుట అని అర్థము. అయితే, పని నుండి విశ్రాంతి అనే కాకుండా ఈ పదాన్ని అనేక విధములైన విశ్రాంతిని  సూచించవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి కొట్లాట నుండి, మాట్లాడుటనుండి లేక కదులుట నుండి విశ్రాంతి తీసుకొనవచ్చు.

  • ఒక వస్తువు “విశ్రాంతి తీసుకొనును” అని కూడా చెప్పవచ్చు.  ఈ మాటకు “నిలిచియుండుట” లేక అక్కడ “కూర్చునియుండుట” అని అర్థము.
  • “విశ్రాంతికి వచ్చినది” అనునది వేరొక చోట “ఆగిపోయినది” అని చెప్పబడును.  .
  • ఒక వ్యక్తి  లేక పశువులు విశ్రాంతి తీసుకొనునప్పుడు సేద తీర్చుకొనుటకు కూర్చుని  ఉండవచ్చు లేక పడుకుని ఉండవచ్చు.
  • ఇశ్రాయేలీయులు వారములోని ఏడవ దినమున విశ్రాంతి తీసుకొనుమని దేవుడు ఆజ్ఞాపించాడు. పనిచేయని ఈ రోజును “సబ్బాతు” దినము అని పిలుస్తారు.
  • ఒక విషయానికి  లేక  ఏదైనా వస్తువుకు విశ్రాంతినివ్వాలంటే దానిని అక్కడ “ఉంచుట  లేక పెట్టుట”  అని అర్థము.

అనువాదం సూచనలు:

  • సందర్భానుసారముగా, “(ఒకరు) విశ్రాంతి తీసుకొనుట” అనే మాటను “పనిచేయడం ఆపుము” లేక “తనకుతాను సేదదీర్చుకోవడం” లేక “భారములు మోయడము ఆపడం” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • ఒక విషయానికి లేక ఏదైనా  వస్తువుకు విశ్రాంతినివ్వడం అనే ఈ మాటను దేనిమీదనైనా ఆ వస్తువును “ఉంచుట” లేక “పెట్టుట” అని కూడా అనువదించవచ్చు.
  • “నేను మీకు విశ్రాంతినిచ్చెదను” అని యేసు చెప్పిన మాటను “ మీ భారము మోయకుండా ఆపునట్లు చేయుదును” లేక “మీరు సమాధానముగా ఉండునట్లు నేను సహాయము చేయుదును” లేక “నాయందు నమ్మకముంచుటకు  మరియు సేదదీరుటకు నేను మిమ్ములను బలపరతును”
  • వారు నా విశ్రాంతిలోనికి ప్రవేశించరు” అని దేవుడు చెప్పిన మాటకు  “నేనిచ్చు విశ్రాంతి ఆశీర్వాదములను వారు అనుభవించరు” లేక “నాయందు విశ్వాసముంచుట ద్వారా వచ్చేటువంటి సంతోష సమాధానములను వారు అనుభవించరు” అని కూడా అనువదించవచ్చు.
  • “విశ్రాంతి” అను పదమును “నిలిఛియున్నవి” లేక “ఇతర ప్రజలందరు” లేక “మిగిలిన ప్రతియొక్కటి” అని కూడా అనువదించవచ్చు.

(ఈ పదములను కూడా చూడండి: remnant, Sabbath)

బైబిల్ రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0014, H1824, H1826, H2308, H3498, H3499, H4494, H4496, H4771, H5117, H5118, H5183, H5564, H6314, H7258, H7280, H7599, H7604, H7605, H7606, H7611, H7673, H7677, H7901, H7931, H7954, H8058, H8172, H8252, H8300, G03720, G03730, G04250, G15150, G18790, G19540, G19810, G22700, G26630, G26640, G26810, G28380, G30620, G45200