te_tw/bible/kt/sabbath.md

5.5 KiB
Raw Permalink Blame History

సబ్బాతు

నిర్వచనము:

“సబ్బాతు” అనే ఈ పదము వారపు రోజులలో ఏడవ రోజును సూచించును, ఈ దినము విశ్రాంతి దినముగాను మరియు ఈ దినమందు ఎటువంటి పని చేయకూడదని, దీనిని ప్రత్యేకించాలని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు.

  • దేవుడు ఆరు రోజులలో సర్వ సృష్టిని సృష్టించిన పిదప, ఆయన ఏడవ రోజున విశ్రాంతి తీసుకొనియున్నాడు. అదే విధముగా, దేవునిని ఆరాధించడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన దినముగా ఏడవ రోజును ప్రత్యేకపరచాలని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు.
  • “సబ్బాతు దినమును పరిశుద్ధ దినముగా ఉంచాలనే” ఆజ్ఞ దేవుడు ఇశ్రాయేలీయులకొరకు రాతి పలకలపైన వ్రాసి మోషేకి ఇచ్చిన పది ఆజ్ఞలలో ఒకటైయుండెను
  • రోజులను లెక్కపెట్టే యూదుల పధ్ధతిని మనము అనుసరించినట్లయితే, సబ్బాతు దినము శుక్రవారము సంధ్యవేళ ఆరంభమై, శనివారము సంధ్యవేళకు ముగియును.
  • పరిశుద్ధ గ్రంథములో కొన్నిమార్లు సబ్బాతును కేవలము సబ్బాతు అని మాత్రమే పిలవకుండా “సబ్బాతు దినము” అని కూడా పిలిచిరి.

తర్జుమా సలహాలు:

  • ఈ మాటను “విశ్రాంతి దినము” లేక “విశ్రాంతి కొరకు నియమించబడిన దినము” లేక “పనిచేయని దినము” లేక “విశ్రాంతి తీసుకొను దేవుని దినము” అని కూడా తర్జుమా చేయుదురు.
  • ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని చూపించుటకు కొన్ని తర్జుమాలలో ఈ పదమును ఎత్తి చూపిస్తారు, ఉదాహరణకు, “సబ్బాతు దినము” లేక “విశ్రాంతి దినము”.
  • ఈ పదమును స్థానిక లేక జాతీయ భాషలో ఏ విధంగా అనువదించబడిందో గమనించండి.

(దీనిని కూడా చూడండి: తెలియని వాటిని ఏ విధంగా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: rest)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 13:05 “ఎల్లప్పుడు సబ్బాతు దినమును పరిశుద్ధముగా ఆచరించండి. అనగా, ఆరు రోజులలో మీ సమస్త పనులన్నియు చేసుకొని, ఏడవ రోజున నన్ను ఘనపరచుటకు మరియు మీరు విశ్రాంతి తీసుకొనుటకు సబ్బాతు దినమును ఆచరించండి.
  • 26:02 యేసు తన చిన్న వయస్సులో నివసించిన స్థలమైన నజరేతు పట్టణమునకు వెళ్ళెను. సబ్బాతు రోజున, ఆయన ఆరాధన స్థలమునకు వెళ్ళెను.
  • 41:03 యేసును సమాధి చేసిన ఆ మరుసటి రోజు సబ్బాతు దినమైయుండెను, మరియు యూదులు ఆ దినమున సమాధి దగ్గరకి వెళ్ళుటకు అనుమతించబడలేదు.

పదం సమాచారం:

  • Strongs: H4868, H7676, H7677, G43150, G45210