te_tw/bible/other/proverb.md

2.5 KiB
Raw Permalink Blame History

సామెత, సామెతలు

నిర్వచనము:

సామెత అనునది ఒక సత్యమునుగాని లేక జ్ఞానమునుగాని తెలియజేసే చిన్న వ్యాఖ్యయైయుండును.

  • సామెతలు శక్తివంతమైనవి ఎందుకంటే వాటిని చాలా తేలికగా గుర్తు పెట్టుకోవచ్చు మరియు చాలా సులభముగా ఉచ్చరించవచ్చును.
  • అనేకమార్లు సామెతలో దైనందిన జీవితములో జరిగే అనేకమైన ప్రయోగాత్మక ఉదాహరణలు కూడా కలిగియుండును.
  • కొన్ని సామెతలు చాలా స్పష్టముగాను మరియు నేర అర్థమును ఇచ్చేవిగానుండును, మరికొన్ని అర్థము చేసుకోవడానికే చాలా కష్టంగా ఉంటాయి.
  • రాజైన సొలొమోను జ్ఞానమునకు ప్రసిద్ధుడు మరియు సుమారు 1,000 సామెతలను వ్రాసాడు.
  • యేసు అనేకమార్లు ప్రజలతో ప్రసంగించినప్పుడు సామెతలను లేక ఉపమానములను ఉపయోగించియున్నాడు.
  • “సామెత” అను ఈ పదమును అనువాదము చేయుటలో “జ్ఞానముగా చెప్పుట” లేక “నిజమైన మాట” అనే మాటలను కూడా చేర్చుతారు.

ఈ పదములను కూడా చూడండి: Solomon, true, wise

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H2420, H4911, H4912, G38500, G39420