te_tw/bible/other/prostrate.md

3.9 KiB

సాష్టాంగపడు, సాష్టాంగపడెను

నిర్వచనము:

“సాష్టాంగపడు” అనే ఈ పదమునకు నేల మీద బోర్ల పడి, తలను ఎత్తకుండా చేతులను చాచి నమస్కరించుట అని అర్థము.

  • ఎవరిముందైన “సాష్టాంగపాడుట” లేక ఒకనిముందు “తనకు తాను సాష్టాంగపడుట” అను మాటలకు అర్థము ఏమనగా ఆ వ్యక్తి ముందు ఆకస్మికముగా నేల మీద బోర్ల పడి వంగుట అని అర్థము.
  • సహజముగా ఈ విధముగా సాష్టాంగపడుటయనునది కంగారును, ఆశ్చర్యకరమును, మరియు విస్మయమును చూపిస్తుంది, ఎందుకంటే ఎదో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగియుండును. ఎవరికైతే సాష్టాంగ నమస్కారము చేశారో ఆ వ్యక్తిపట్ల గౌరవమును మరియు ఘనతను కూడా చూపిస్తుంది.
  • సాష్టాంగపడుట కూడా దేవుని ఆరాధించుటలో ఒక భాగమైయుండును. యేసు ప్రభువు అద్భుతము చెసినప్పుడు ప్రజలు ఆయనను ఆరాధించుచు కృతజ్ఞతలు తెలియజేయుటలో లేక ఆయనను ఒక గొప్ప బోధకునిగా ఘనపరచుటలో వారు ఈ విధముగా కూడా అనేకమార్లు ప్రతిస్పందించుదురు.
  • సందర్భానుసారముగా “సాష్టాంగపడెను” అని అనువాదము చేయు వేరొక విధానములో “నేలకు తలను తాకించి చాలా క్రిందికి తగ్గించుకొని క్రిందకి వంగుట” లేక “ఆయన ముందుట తలను నేలకు తాకించి ఆరాధించుట” లేక “ఆశ్చర్యకరమైన విధానములో నేలకు వంగి నమస్కరించుట” లేక “ఆరాధించుట” అనే మాటలు ఉపయోగించుదురు.
  • “మనకు మనము సాష్టాంగపడలేము” అనే ఈ మాటను “ఆరాధించుకోలేము” లేక “ఆరాధనలో ముఖమును క్రిందకు పెట్టలేము” లేక “క్రిందకి వంగి, ఆరాధించుకోలేము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “తనను తాను సాష్టాంగపడుట” అనే ఈ మాటను “ఆరాధించుట” లేక “వారి ముందు క్రిందకి వంగుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: విస్మయము, వంగుట)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H5307, H5457, H6440, H6915, H7812