te_tw/bible/other/profane.md

2.5 KiB

అపవిత్రమైన, అపవిత్రం చెయ్యబడిన

నిర్వచనము:

దేనినైనా అపచరించుట అనగా పరిశుద్ధమైనదానిని దేనినైనా అగౌరవపరచుట, లేక కలుషితము చేయుట, మలినము చేయుట అని అర్థము.

  • అపవిత్రుడైన వ్యక్తి దేవునిని అగౌరవపరచేవాడిగాను మరియు అపరిశుద్ధముగా నడుచుకొను వ్యక్తిగాను ఉంటాడు.
  • “అపవిత్రమైన” అనే పదమునకు క్రియాపదముగా “అపవిత్రముగా నడుచుకొనుట” లేక “దేని విషయములోనైనా అగౌరవముగా నడుచుకొనుట” లేక “అవమానించుట” అని అనువాదం  చేయవచ్చును.
  • వారు విగ్రహములతో తమ్మును తామే “అపవిత్రపరచుకొనిరి” అని దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పెను, ఈ మాటకు అర్థము ఏమనగా ప్రజలు తమ్మును తాము “అపవిత్రపరచుకొనుచున్నారు” లేక ఈ పాపమును చేయుట ద్వారా తమ్మును తాము “అగౌరవపరచుకొనుచున్నారు” అని అర్థము కలదు. వారు దేవునిని కూడా అవమానించియున్నారు.
  • సందర్భానుసారముగా, “అపవిత్రత" అను విశేషణమును “అవమానించుట” లేక “దైవరహిత” లేక “అపవిత్రత” అని కూడా అనువాదం  చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: defile, holy, clean)

బైబిలు రిఫరెన్సులు:

  • 2 తిమోతి.02:16-18
  • యెహె.20:09
  • మలాకి.01:10-12
  • మత్తయి.12:05
  • సంఖ్యా.18:30-32

పదం సమాచారం:

  • Strong's: H2455, H2490, H2491, H5234, H8610, G09520, G0953