te_tw/bible/other/partial.md

2.5 KiB
Raw Permalink Blame History

పాక్షికం, పక్షపాతము

నిర్వచనము:

“పాక్షికంగా ఉండు” మరియు “పక్షపాతము చూపించు” అను మాటలు ఇతర ప్రజలకంటే కేవలము నచ్చిన కొంతమందిని మాత్రమె చాలా ప్రాముఖ్యముగా ఎంచుటను సూచించును.

  • ఇది అభిమానమును చూపించుటకు సమానము. అనగా ఇతరులకంటే కొంతమందిని బాగుగా  చూసుకోవడము.
  • సహజముగా పక్షపాతము లేక అభిమానాన్ని  ఇతరుల కన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించినవారు లేక ఎక్కువ శ్రీమంతులు అయినా వారి యెడల చుపుదురు. .
  • అయితే,  గొప్పవారికి  లేక పెద్ద హోదా ఉన్న వారి యెడల పక్షపాతము  గాని లేక అభిమానము గాని చూపించవద్దని బైబిల్ తన ప్రజలకు సూచించు చున్నది.
  • పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలో దేవుడు ఎటువంటి పక్షపాతము లేకుండా జనులందరికి ఒకే విధముగా తీర్పు తీర్చునని బోధిస్తున్నాడు.
  • శ్రీమంతులైన వారికి మంచి కుర్చీ లేక  ఇతరులకంటే బాగుగా చూసుకోవడం తప్పని యాకోబు పత్రిక బోధించుచున్నది.

(ఈ పదాలను కూడా చూడండి:favor)

బైబిల్ రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H5234, H6440, G09910, G15190, G29830, G42990, G43830