te_tw/bible/kt/favor.md

3.7 KiB
Raw Permalink Blame History

అనుగ్రహం, అనుకూలమైన, పక్షపాతం

నిర్వచనము

"అనుగ్రహం" అంటే దయ చూపడం. ఎవరైనా వేరొకరిపై దయ చూపి అతని పట్ల  సానుకూలంగా మరియు ఆమోదించడము అని అర్ధం. .

  • యేసు దేవుని,యొక్కయు  మనుషుల యొక్కయు “దయలో"  ఎదిగాడు. అంటే వారు అయన యొక్క గుణలక్షణాలను  మరియు  ప్రవర్తనను  ఆమోదించారు.
  • ఎవరిదైనా "అనుగ్రహం పొందడం" అంటే ఆ వ్యక్తి ద్వారా ఆమోదింపబడడం. .
  • రాజు ఎవరి మీదనైనా అనుగ్రహం చూపడం అంటే అతడు ఆ వ్యక్తి యొక్క విన్నపాలను ఆమోదించి మంజూరు చేస్తాడని భావం.
  • "అనుగ్రహం" అంటే కొన్ని సైగలు లేక కార్యాలు  చేసి మరొకవ్యక్తికి మేలు కలిగించడం.
  • “పక్షపాతం” అంటే ఇతరుల పట్ల కాకుండా కొంత మంది  యెడల సానుకూలంగా వ్యవహరించే వైఖిరి.అనగా ఒక వ్యక్తికి బదులు వేరొకరిపై మొగ్గు చూపుట, లేక ఒక దానికి బదులు వేరొకటి ఎందుకంటే, ఆ వ్యక్తి లేక ఆ వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వబడినది. సాధారణంగా పక్షపాతము అనేది అన్యాయముగా పరిగణింపబడుతుంది.

అనువాదం సూచనలు

  • అనువదించడంలో ఇతర పద్ధతులు. "అనుగ్రహం" అంటే “ ఆమోదం” "ఆశీర్వాదం” లేక “మేలు."
  • "యెహోవా ‘యెహోవా హితవత్సరము" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. “యెహోవా గొప్ప ఆశీర్వాదాలను తీసుకువచ్చే” సమయము
  • "పక్షపాతం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పక్షపాత బుద్ధి” లేక “దురభిమానం” లేక “అన్యాయంగా ప్రవర్తించు." "ప్రియమైన వాడు," అంటే "ఇష్టుడు, ప్రేమను చూరగొన్న వాడు."

బైబిల్ రిఫరెన్సులు

పదం సమాచారం

  • Strongs: H0995, H1156, H1293, H1779, H1921, H2580, H2603, H2896, H5278, H5375, H5414, H5922, H6213, H6437, H6440, H7521, H7522, H7965, G11840, G36850, G43800, G43820, G54850, G54860