te_tw/bible/other/lust.md

2.4 KiB
Raw Permalink Blame History

మోహం, మోహపూరిత, ఉద్రేకాలు, వాంఛలు

నిర్వచనం:

మోహం అంటే బలమైన వాంఛ, సాధారణంగా పాపసంబంధమైన దానిని లేదా అనైతికమైన దానిని కోరుకొనే సందర్భంలోనిది. మోహించడం అంటే మొహం కలిగియుండడమే.

·         బైబిలులో, “మోహం” అంటే సాధారణంగా ఒకని సొంత జీవితభాగస్వామి కాకుండా మరొకరి కోసం లైంగిక వాంఛను కలిగియుండడం అని అర్థం.

·         కొన్నిసార్లు ఈ పదం విగ్రహాలను పూజించడానికి రూపకంగా ఉపయోగించబడింది.

·         సందర్భాన్ని బట్టి “మోహం” అనే పదం “చెడు వాంఛ" లేదా “బలమైన వాంఛ" లేదా “చెడు లైంగిక వాంఛ" లేదా “బలమైన అనైతిక వాంఛ" లేదా “పాపం చేయడానికి బలమైన వాంఛ" అని అనువదించబడవచ్చు.

·         ”మోహించడం” అనే పదబంధం “చెడుగా కోరుకోవడం” లేక “అనైతికంగా ఆలోచించడం" లేదా "అనైతికంగా కోరుకోవడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: adultery, false god)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0183, H0185, H0310, H1730, H2181, H2183, H2530, H5178, H5375, H5689, H5691, H5869, H7843, G07660, G19370, G19390, G22370, G37150, G38060