te_tw/bible/other/letter.md

2.5 KiB
Raw Permalink Blame History

పత్రిక, ఉత్తరం

నిర్వచనం:

ఉత్తరం అనేది సాధారణంగా రచయిత నుండి దూరంగా ఉండే వ్యక్తికి లేదా వ్యక్తుల సమూహానికి పంపబడే వ్రాతపూర్వక సందేశం. పత్రిక అనేది ఒక ప్రత్యేక రకమైన ఉత్తరం, , తరచుగా బోధన వంటి ప్రత్యేక ఉద్దేశం కోసం మరింత అధికారిక శైలిలో వ్రాయబడుతుంది.

  • కొత్తనిబంధన కాలంలో, పత్రికలూ, ఇతర రకాలైన ఉత్తరాలు జంతు చర్మాలతో చేసిన తోలు పత్రాలు, మొక్కలనుండి పీచుతో చేసిన పురాతన పత్రాలలో రాసేవారు.
  • అపోస్తలుడైన పౌలు, యోహాను, యాకోబు, యూదా, పేతురుల రాసిన హెచ్చరికా పూరిత పత్రికలు రోమా సామ్రాజ్యం అంతటిలోనూ ఉన్న వివిధ నగరాలలో ఉన్న క్రైస్తవులను ప్రోత్సహించడానికీ, హెచ్చరించడానికీ, వారికి బోధించడానికి ఉద్దేశించినవి.
  • ఈ పదాన్ని అనువదించడంలో “రాయబడిన సందేశం” లేదా “రాయబడిన మాటలు” లేదా “రాత” అని అనువదించవచ్చు.

(ఇవి కూడా చూడండి: ప్రోత్సాహం, హెచ్చరిక, ఉపదేశం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0104, H0107, H3791, H4385, H5406, H5407, H5612, G11210, G19920