te_tw/bible/other/courage.md

6.6 KiB

ధైర్యం, ధైర్యంగల, ప్రోత్సహించు, ప్రోత్సాహం, నిరుత్సాహపరచు, అధైర్యం/నిరుత్సాహం

వాస్తవాలు:

"ధైర్యం" అనే పదం కష్టమైనవి, భయపెట్టేవి, లేదా ప్రమాదకరమైనవాటిని నిర్భయంగా/ ఎదుర్కోవడం లేదా వాటిని చెయ్యడం అని సూచిస్తుంది.

  • "ధైర్యం గల" అనే పదం ధైర్యాన్ని చూపించే వ్యక్తినీ, భయంగా అనిపించినప్పటికీ లేదా విడిచి పెట్టాలనే ఒత్తిడి వచ్చినప్పటికీ సరియైన దానిని చేస్తున్న వ్యక్తినీ గూర్చి వివరిస్తుంది.
  • ఒక వ్యక్తి భావోద్రేకమైన లేదా శారీరకమైన బాధను ఎదుర్కున్నప్పుడు బలంతోనూ, పట్టుదలతోనూ కనపరుస్తాడు.
  • "ధైర్యంగా ఉండు" అంటే "భయపడవద్దు" లేదా "సంగతులన్నీ/పరిస్థితులన్నీ సక్రమంగా జరుగుతాయనే నిశ్చయత కలిగియుండు" అని అర్థం.
  • యెహోషువా ప్రమాదకరమైన కనాను దేశము వెళ్ళడానికి సిద్దపడుతున్నప్పుడు అతడు "బలము కలిగి ధైర్యంగా" ఉండాలని మోషే హెచ్చరిస్తున్నాడు.
  • "ధైర్యంగల" అనే పదమును "సాహసం" లేదా "నిర్భయం" లేదా "ధైర్యసాహసం" అని కూడ అనువదించవచ్చు.
  • సందర్భాన్ని బట్టి "ధైర్యం కలిగియుండు" పదబంధమును  "భావోద్రేకంగా బలంగా ఉండు" లేదా "ఆత్మ విశ్వాసం కలిగియుండు" లేదా "స్థిరంగా నిలబడు/ఘట్టిగా" అని అనువదించవచ్చు.
  • "ధైర్యంగా మాట్లాడు" టను "ధైర్యసాహసంతో మాట్లాడు" లేదా "భయం లేకుండా మాట్లాడు" లేదా "నమ్మకంతో మాట్లాడు" అని అనువదించవచ్చు.

"ప్రోత్సాహించు" మరియు “ప్రోత్సాహం" అనే పదాలు ఒకరికి ఆదరణ, నిరీక్షణ, నిబ్బరం, ధైర్యం కలిగి యుండునట్లు చెప్పేవాటిని, చేసేవాటిని సూచిస్తున్నాయి.

  • దానికి సమానమైన పదము "హెచ్చరించు" అనగా ఎవరినైనా తప్పుడు పనులను తిరస్కరించుమని మరియు మంచిదానిని సరైనదానిని చేయమని ప్రేరేపించుట.
  • అపోస్తలుడైన పౌలూ, కొత్త నిబంధనలోని ఇతర రచయితలూ ఒకరినొకరు ప్రోత్సాహించుకుంటూ ప్రేమ చూపుతూ మరియు ఇతరులకు సేవచేయుచూ ఉండాలని క్రైస్తవులకు బోధించారు.

"నిరుత్సాహపరచు" అనే పదం ప్రజలు నిరీక్షణనూ, నమ్మకాన్నీ, ధైర్యాన్ని పోగొట్టుకొనేలా చేసే మాటలు మాట్లాడడం లేదా పనులు చెయ్యడాన్ని సూచిస్తుంది. తద్వారా వారు చెయ్యాలని తెలిసిన దానిని, కష్టపడి చెయ్యాలనే ఆశను తక్కువ చెయ్యడం అని అర్థం.

అనువాదం సలహాలు

  • సందర్భాన్ని బట్టి, "ప్రోత్సహించు" అనే పదమును "ప్రేరేపించు" లేదా "ఆదరించు" లేదా "దయగల మాటలు చెప్పు" లేదా "సహాయం చేయి, సహకారం అందించు" అని అనువదించవచ్చు.
  • "ప్రోత్సాహపు మాటలు చెప్పు" అంటే "ప్రజలు తాము ప్రేమించబడ్డారు/ప్రేమించబడునట్లు, అంగీకరించబడ్డారు/అంగీకరించబడునట్లు, శక్తితో నింపబడ్డారు/బలపరచబడునట్లు" భావించేలా చేసే మాటలు చెప్పుట" అని అర్థం.

(చూడండి: నమ్మకంహెచ్చరించుభయంబలం)

బైబిలు రిఫరెన్సులు:

  • ద్వితీ 01:37-38
  • 2 రాజులు 18:19-21
  • 1 దిన 17:25
  • మత్తయి 09:20-22
  • 1 కొరింథీ 14:01-04
  • 2 కొరింథీ 07:13
  • అపొ. కా. 05:12-13
  • అపొ. కా. 16:40
  • హెబ్రీ 03:12-13
  • హెబ్రీ 13:05-06

పదం సమాచారం:

  • Strong's: H0533, H0553, H1368, H2388, H2388, H2428, H3820, H3824, H7307, G21140, G21150, G21740, G22920, G22930, G22940, G38700, G38740, G39540, G43890, G48370, G51110