te_tw/bible/other/heir.md

2.6 KiB
Raw Permalink Blame History

వారసుడు

నిర్వచనం:

"వారసుడు" అంటే చనిపోయిన వ్యక్తికి చెందిన ఆస్థిని లేదా డబ్బును న్యాయబద్దంగా పొందేవాడు అని అర్థం.

  • బైబిలు కాలములలో ముఖ్య వారసుడు మొదట పుట్టిన కుమారుడే లేదా జ్యేష్టుడే. అతడు తన తండ్రి డబ్బులోనూ, ఆస్థిలోనూ ఎక్కువభాగాన్ని పొందుతాడు.
  • బైబిలు "వారసుడు" పదాన్ని ఆత్మీయ తండ్రి దేవుని నుండి ఆత్మీయ ప్రయోజనాలను పొందే క్రైస్తవుడిగా అలంకారికంగా కూడా ఉపయోగిస్తుంది.
  • దేవుని పిల్లలుగా క్రైస్తవులు " యేసు క్రీస్తుతో ఉమ్మడి వారసులు" అని పిలువబడ్డారు. ఈ పదబంధం "సహ వారసులు" లేదా "తోటి వారసులు" లేదా "ఆయనతో కలిసి వారసులు" అని అనువదించబడవచ్చు.
  • "వారసుడు" పదం "ప్రయోజనాలను పొందుకొనే వ్యక్తి" లేదా "తల్లిదండ్రులు గానీ లేదా ఇతర బంధువులు చనిపోయినతరువాత ఆస్థినీ, ఇతర వస్తువులను పొందుకొనే వాడు అనే అర్థాన్ని తెలియపరచేలా భాషలో వ్యక్తీకరించబడినదేనితోనైనా అనువదించబడవచ్చు.

(చూడండి:firstborn, inherit)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1121, H3423, G28160, G28180, G28200, G47890