te_tw/bible/other/foreordain.md

2.4 KiB

ముందుగా ఎరిగిన, భవిష్యద్‌జ్ఞానము

నిర్వచనం:

"ముందుగా ఎరిగిన” “భవిష్యద్‌జ్ఞానము" అనే పదాలు "ముందుగా తెలియడం" అనే క్రియా పదం నుండి వచ్చాయి, దీని అర్థం ఏదైనా సంభవించడానికి ముందే ఎరిగియుండడం.

  • దేవుడు కాలం చేత పరిమితి చెయ్యబడడు. గతం, వర్తమానం మరియు భవిష్యత్తులో జరిగే సమస్తము ఆయన యెరుగును.
  • యేసును రక్షకుడుగా స్వీకరించడం ద్వారా రక్షణ పొందిన వారిని దేవుడు ముందుగా ఎరిగియున్న విషయాన్నీ చెప్పడానికి తరచుగా ఈ పదాన్ని ఉపయోగిస్తారు.

అనువాదం సూచనలు:

  • "ముందుగా ఎరిగిన" అనే పదం "ముందే తెలిసి ఉండడం” లేదా “సమయానికి ముందే తెలిసి యుండడం” లేదా “ముందస్తుగా తెలియడం” లేదా “ముందే తెలిసి ఉండడం" అని అనువదించబడవచ్చు.
  • "భవిష్యద్‌జ్ఞానము" పదం "ముందే ఎరిగి ఉండడం” లేదా “సమయానికి ముందుగా తెలిసి ఉండడం” లేదా “ఇప్పటికే తెలిసియుండడం” “ముందుగా తెలిసియుండడం” అని అనువదించబడవచ్చు.

(వీటిని కూడా చూడండి: తెలియడం, , ముందుగా నిర్ణయించడం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G42670, G42680