3.2 KiB
3.2 KiB
ముందుగా నిర్ణయించబడుట, ముందుగా నిర్ణయించబడినది
నిర్వచనము:
“ముందుగా నిర్ణయించుట” మరియు “ముందుగా నిర్ణయించబడుట” అనే పదములు ఏదైనా కార్యము జరుగక మునుపే ప్రణాళికవేయుట లేక నిర్ణయించుటను సూచిస్తుంది.
- ఈ పదము ప్రత్యేకముగా నిత్యజీవము పొందటానికి దేవుడు ప్రజలను ముందుగానే నిర్ణయించియున్నాడని సూచిస్తుంది.
- కొన్నిసార్లు “ముందుగా నియమించుట” అనే పదము కూడా ఉపయోగించబడింది, ఈ మాటకు కూడా ఏదైనా కార్యము జరుగక మునుపే నిర్ణయించుట అని అర్థము కలదు.
అనువాదం సలహాలు:
- “ముందుగా నిర్ణయించబడుట” అనే ఈ మాటను “ముందుగానే తీర్మానించుట” లేక “రానున్న సమయాన్ని లేక విధిని ముందుగా తీర్మానించుట” అని కూడా అనువదించవచ్చు.
- “ముందుగా నిర్ణయించబడెను” అనే ఈ మాటను “ఎంతో కాలము క్రితమే నిర్ణయించబడియుండుట” లేక “రానున్న సమయాన్ని లేక విధిని ప్రణాళిక చేయుట” లేక “ఏదైనా కార్యము జరుగక మునుపే తీర్మానము చేయుట” అని కూడా అనువదించవచ్చు.
- “మనము ముందుగానే నిర్ణయించబడియున్నాము” అనేటటువంటి వ్యాఖ్యను “మనము ఇలా ఉండాలని ఎంతో కాలము క్రితమే తీర్మానించబడియుండవచ్చు” లేక “రానున్న కాలములో మనము ఇలా ఉండాలని మనమిప్పటికే నిర్ణయించబడియున్నాము” అని కూడా అనువదించవచ్చు.
- ఈ పదము యొక్క అనువాదం “ముందుగా తెలిసికొనియుండుట” అను మాటకు విభిన్నముగా ఉండునట్లు చూచుకొనవలెనని సూచన.
(చూడండి: ముందుగా తెలిసియుండుట)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 కొరింథి.02:06-07
పదం సమాచారం:
- Strong's: G43090