te_tw/bible/other/detestable.md

3.9 KiB

అసహ్యించు, అసహ్యించుకొన్న , అసహ్యమైన

వాస్తవాలు:

"అసహ్యమైన" పదం అయిష్టమైనదానినీ, నిరాకరించబడినదానిని వివరిస్తుంది. "అసహ్యించుకోవడం" అంటే బలమైన అయిష్టత కలిగి ఉండడం.

  • తరచుగా బైబిలు దుర్మార్గతను అసహ్యించుకోమని మాట్లాడుతుంది. అంటే దుష్టత్వాన్ని అసహ్యించాలి, దానిని తిరస్కరించాలి.
  • అబద్ద దేవుళ్ళను ఆరాధించిన వారి దుష్టఆచారాలను వర్ణించడానికి "అసహ్యమైన" పదాన్ని దేవుడు ఉపయోగించాడు.
  • పొరుగు ప్రజల సమూహాలు ఆచరించే పాపపూరితమైన, అనైతిక కార్యాలను "అసహ్యించుకోవాలని" ఇశ్రాయేలీయులు ఆజ్ఞాపించబడ్డారు.
  • చెడు లైంగిక క్రియలన్నిటినీ "అసహ్యమైనవి" గా దేవుడు పిలిచాడు
  • సోదె చెప్పడం, మంత్ర విద్య, పిల్లలను బలిగా అర్పించం ఇలాటివన్నీ దేవునికి "అసహ్యమైన" కార్యాలు.
  • "అసహ్యించు" పదబంధం "బలంగా తిరస్కరించడం” లేదా “అసహ్యించుకోవడం” లేదా “తీవ్రమైన దుష్టత్వంగా ఎంచడం" అని అనువదించబడవచ్చు.
  • "అసహ్యమైన" పదం "భయంకరమైన దుష్టత్వం” లేదా “నీచమైన” లేదా “తిరస్కారానికి అర్హమైన" పదాలుగా అనువదించబడవచ్చు.
  • నీతిమంతుడు దుష్టులకు "అసహ్యమైన" వాడుగా యెంచబడినప్పుడు, "చాలా అవాంఛనీయమైనదిగా యెంచబడడం" లేదా "అప్రియమైనది” లేదా “తిరస్కరించబడినది" అని అనువదించబడవచ్చు.
  • "అపవిత్రమైన" జంతువులు అని దేవుడు ప్రకటించిన కొన్ని నిర్దిష్ట రకాల జంతువులు "అసహ్యమైనవని ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు. అవి ఆహారానికి సరిపోవు. ఇది "బలంగా అయిష్టత చూపడం” లేదా “తిరస్కరించడం” లేక “అనంగీకారమైనదిగా యెంచడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి: సోది చెప్పడం, శుభ్రం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1602, H6973, H8130, H8251, H8262, H8263, H8441, H8581, G946, G947, G948, G4767, G5723, G3404