te_tw/bible/other/creature.md

2.5 KiB
Raw Permalink Blame History

జీవి, సృష్టి

నిర్వచనం:

"జీవి" అనే పదం దేవుడు సృష్టించిన అన్ని జీవులను సూచిస్తుంది, మానవులు, జంతువులు రెండూ.

  • ప్రవక్త యెహెజ్కేలు దేవుని మహిమ యొక్క తన దర్శనంలో "జీవులను" చూడడం గురించి వర్ణించాడు. అవేమిటో అతనికి తెలియలేదు, కాబట్టి వాటికి అతడు సాధారణ నామాలు ఇచ్చాడు.
  • "సృష్టి" అనే పదాన్ని గమనించండి, దీనికి వివిధ అర్థాలు ఉన్నాయి. దీనిలో దేవుడు సృష్టించిన ప్రతీది ఉంది, జీవం ఉన్నవీ, మరియు (భూమి, నీరు, మరియు నక్షత్రాలు) వంటి జీవం లేనివి ఉన్నాయి. "జీవి" అనే పదం జీవము గలవాటిని మాత్రమే సూచిస్తున్నాయి.

అనువాదం సూచనలు

  • సందర్భాన్ని బట్టి, "జీవి" పదాన్ని "ప్రాణి” లేదా “జీవం గలది” లేదా “సృష్టించ బడినది" అని అనువదించవచ్చు.
  • "జీవులు" అనే బహువచన పదం "ప్రాణులన్నీ” లేదా “మనుషులు, జంతువులు” లేదా “జంతువులు” లేదా “మానవులు" అని అనువదించబడవచ్చు.

(చూడండి: సృష్టించు)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1320, H1321, H1870, H2119, H2416, H4639, H5315, H5971, H7430, H8318, G22260, G29370, G29380