te_tw/bible/other/counselor.md

2.9 KiB

సలహా, సలహా ఇవ్వడం, సలహాదారు, ఆలోచన, ఆలోచన చెప్పువాడు, ఆలోచన చెప్పడం

నిర్వచనం:

పదాలు "ఆలోచన” “సలహా" అనే పదాలకు ఒకటే అర్థం. మరియు ఎవరికైనా కొన్ని పరిస్థితుల్లో జ్ఞానం గల సలహా ఇచ్చి సహాయం చేయడం అని సూచిస్తుంది. జ్ఞానం గల "ఆలోచన చెప్పువాడు” లేక “సలహాదారు" అంటే సలహా లేక ఆలోచన చెప్పి ఒక వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తాడు.

  • రాజుల దగ్గర తరచుగా అధికార సలహాదారులు లేక ఆలోచన చెప్పువారు ఉండి ఆ రాజులు ఏలుతున్న ప్రజల ప్రాముఖ్యమైన సమస్యల విషయంలో నిర్ణయాలు చేయడానికి సహాయం చేస్తారు.
  • కొన్ని సార్లు ఇచ్చిన సలహా లేక ఆలోచన మంచిది కాకపోవచ్చు. దుష్ట సలహాదారులు ఒక రాజును అతని ప్రజలకు హానికరమైన చర్యలు తీసుకునేలా ప్రోత్సహించ వచ్చు.
  • సందర్భాన్ని బట్టి, దీనిని "సలహా” లేక “ఆలోచన" పదాలను "నిర్ణయం చేయడంలో సహాయం” లేక “హెచ్చరికలు” లేక “జాగ్రత్తలు” లేక “నడిపింపు" అని కూడా అనువాదం చెయ్యవచ్చు.
  • "ఆలోచన" అనే పదాన్ని "సలహా ఇవ్వడం” లేక “సూచనలు చెయ్యడం” లేక “హెచ్చరించు."అని అనువాదం చెయ్యవచ్చు.
  • "ఆలోచన" పదం "సమాలోచన సభ," ఒకటి కాదు అని గమనించండి. సభ ఒక గుంపు ప్రజలను సూచిస్తుంది.

(చూడండి: exhort, Holy Spirit, wise)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1697, H1847, H1875, H1884, H1907, H3272, H3289, H3982, H4156, H4431, H5475, H5779, H6440, H6963, H6098, H7592, H8458, G10110, G10120, G11060, G48230, G48250