te_tw/bible/other/contempt.md

2.7 KiB

తిరస్కారం, నిరసించదగిన

వాస్తవాలు:

ఈ పదం "తిరస్కారం" తీవ్రమైన అమర్యాద, అప్రతిష్టలను సూచిస్తున్నది. ఒక యుద్ధంలో శత్రువుమీద తిరస్కారం చూపుతారు. దేన్నైనా నీచంగా త్రోసిపుచ్చడాన్ని "నిరసించదగిన" అన్నారు.

  • ఒక వ్యక్తి ప్రవర్తన బహిరంగంగా దేవునికి అమర్యాద చూపితే ఈ పదం వాడతారు. "నిరసించదగిన" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు "గొప్ప అమర్యాద చూపడం” లేక “పూర్తిగా అప్రతిష్ట పాలు చెయ్యడం” లేక “నిరసనకు పాత్రమైన."
  • " తిరస్కారం చూపడం" అంటే న్యాయాధిపతి ఎవరినైనా నీచమైన విలువ గల వాడుగా ఎంచడం అనే సందర్భం.
  • ఈ అనే మాటలకు ఒకే విధమైన అర్థం: "ఒకరి పట్ల తిరస్కార భావం” లేక “తిరస్కారం చూపు” లేక “తిరస్కారభావం కలిగి ఉండు” లేక “తిరస్కారంగా ఒకరి పట్ల ప్రవర్తించు." వీటన్నిటికీ "బలమైన అమర్యాద” లేక “తీవ్ర అప్రతిష్ట " అని అర్థం.
  • వ్యభిచారం, హత్య జరిగించడం ద్వారా దావీదు రాజు పాపం చేసినప్పుడు, అతడు తన పట్ల తిరస్కారం చూపాడని దేవుడు చెప్పాడు. అంటే అతడు తీవ్రమైన అమర్యాద, అగౌరవం దేవుని పట్ల చూపాడు.

(చూడండి: అప్రతిష్ట)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H936, H937, H959, H963, H1860, H7043, H7589, H5006, G1848