te_tw/bible/other/consume.md

3.8 KiB
Raw Permalink Blame History

దహించు, దహించు, దహించిన, దహించే

నిర్వచనం:

ఈ పదం "దహించు" అనే దానికి అక్షరాలా అర్థం దేన్నైనా పూర్తిగా వాడుకోవడం. దీనికి అనేక అలంకారికంగా అర్థాలు ఉన్నాయి.

  • బైబిల్లో, ఈ పదం "దహించు" అనే పదం తరచుగా వస్తువులు మనుషులు నాశనం కావడం సూచిస్తున్నది
  • అగ్నివస్తువులను దహించి వేస్తుంది. అంటే తగలబెట్టి నాశనం చేస్తుంది.
  • దేవుణ్ణి "దహించే మంట," గా అభివర్ణించడం చూస్తున్నాము. పాపానికి వ్యతిరేకంగాతన కోపానికి ఇది వర్ణన. ఆయన కోపం పశ్చాత్తాప పడు పాపులను శిక్షిస్తూ ఉంది.
  • ఆహారాన్ని ఆరగించడానికి కూడా ఈ మాట వాడతారు.
  • పద బంధం, "దేశాన్ని దహించడం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"దేశాన్నినాశనం చేయడం."

అనువాదం సలహాలు:

  • దేశం, లేక ప్రజలను దహించివేయడం, అనే సందర్భంలో ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు "నాశనం."
  • మంట అనే అర్థం వచ్చినప్పుడు "దహించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు, "కాల్చి వేయు."
  • తగలబడిపోతున్న పొద "దహించుకు పోవడం" లేదు అని మోషే చూసిన సందర్భంలో ఇలా అనువదించ వచ్చు, "పూర్తిగా కాలిపోవడం లేదు” లేక “అది తగలబడి పోవడం లేదు."
  • తినడం అనే అర్థం ఇచ్చే సందర్భంలో "దహించు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అరగించు” లేక “దిగమింగు."
  • ఎవరి బలమైనా "దహించుకు పోతుంది," అంటే తన బలం "హరించుకుపోయింది” లేక “పోయింది."
  • "దేవుడు దహించే మంట" అనే మాటను ఇలా అనువదించ వచ్చు, "దేవుడు అన్నిటినీ కాల్చి వేసే మంట” లేక “దేవుడు పాపానికి వ్యతిరేకంగా కోపపడి నాశనం పాపులను మంటలాగా కాల్చి వేస్తాడు."

(చూడండి:devour, wrath)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0398, H0402, H1086, H1104, H1197, H2628, H3615, H3617, H3857, H4529, H5595, H8046, H8552, G03550, G26180, G26540, G27190, G53150