te_tw/bible/other/cherubim.md

3.9 KiB

కెరూబు, కెరూబులు

నిర్వచనం:

ఈ పదం "కెరూబు," దాని బహువచనం "కెరూబులు," వుడు చేసిన ఒక ప్రత్యేక పరలోక జీవి. బైబిల్ వర్ణించిన కెరూబులకు రెక్కలు, మంటలు ఉన్నాయి.

  • కెరూబులు దేవుని మహిమను, శక్తిని ప్రదర్శిస్తారు. వారు పవిత్ర వస్తువుల సంరక్షకులు.
  • తరువాత ఆదాము, హవ్వలు పాపం చేసినప్పుడు, దేవుడు అగ్ని ఖడ్గాలున్న కెరూబులను ఏదేను తోటకు తూర్పువైపున పెట్టాడు. మనుషులు జీవ వృక్షం సమీపించకుండా ఇలా చేశాడు.
  • దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక దానికొకటి అభిముఖంగా ఉండే రెండు కెరూబులు తయారు చెయ్యమని అజ్ఞాపించాడు. వారి రెక్కలు నిబంధన మందసం ప్రాయశ్చిత్తం మూత పై ఒక దానికొకటి తాకుతూ ఉండాలి.
  • అతడు వారికి ఇంకా ఇలా చెప్పాడు. కెరూబుల రూపాలను ప్రత్యక్ష గుడారం తెరలపై కుట్టాలి.
  • కొన్ని వాక్య భాగాల్లో, ఈ జీవుల వర్ణన ఉంది. వారికి నాలుగు ముఖాలు: మనిషి, సింహం, ఎద్దు, గరుడ పక్షి.
  • కెరూబులను కొన్ని సార్లు దేవదూతలు అని ఎంచారు. అయితే బైబిలు దీన్ని స్పష్టంగా చెప్పడం లేదు.

అనువాదం సలహాలు:

  • ఈ పదం "కెరూబులు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"రెక్కల జీవులు” లేక “రెక్కలున్న కాపలా దారులు” లేక “ఆత్మ సంబంధమైన రెక్కల సంరక్షకులు” లేక “పరిశుద్ధ రెక్కల ప్రాణులు."
  • "కెరూబు"ను ఇలా అనువదించ వచ్చు. కెరూబులు కు ఏకవచనం, "రెక్కల జీవి” లేక “రెక్కలున్న ఆత్మ సంబంధమైన సంరక్షకుడు."
  • ఈ పదాన్ని దేవదూతలు అని అర్థం ఇచ్చే వివిధ పదాల నుండి వేరుగా అనువాదం అయ్యేలా చూడండి.
  • ఈ పదాన్ని బైబిల్ అనువాదంలో స్థానిక, లేక జాతీయ భాషలో కూడా అనువదించ వచ్చు.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: దేవదూత)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3742, G5502