te_tw/bible/other/census.md

2.6 KiB

జనసంఖ్య

నిర్వచనం:

"జనసంఖ్య"అనే ఈ పదం ఒక జాతి లేక సామ్రాజ్యం జనాభా లెక్కను గురించి వాడతారు.

  • పాత నిబంధనలో వివిధ సమయాల్లో దేవుడు ఇశ్రాయేలు వారిని లెక్కించాలని ఆజ్ఞ ఇచ్చాడు. అలాటి జనసంఖ్యను ఇశ్రాయేలీయులు మొదటిగా ఈజిప్టును వదిలిన తరువాత తిరిగి కనానులో ప్రవేశించక ముందు చేశారు.
  • తరచుగా జనసంఖ్య ఉద్దేశం ఎంత మంది ప్రజలు పన్నులు కడతారో చూడడం.
  • ఉదాహరణకు, ఒక సారి నిర్గమ కాండంలో ఇశ్రాయేలు మనుషులను లెక్కించారు. ప్రతి ఒక్కరూ ఆలయం కోసం అర షెకెల్ పన్ను చెల్లించాలి.
  • యేసు బాల్యంలో రోమా ప్రభుత్వం జనసంఖ్య నిర్వహించారు. వారి సామ్రాజ్యం అంతటా పన్నులు కట్టవలసిన ఎంత జనాభా ఉన్నదో లెక్కించారు.

అనువాదం సలహాలు

  • ఈ పదాన్ని అనువదించడం. "పేర్ల లెక్క” లేక “పేర్ల జాబితా” లేక “నమోదు."
  • "జనసంఖ్య తీసుకోవడం"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మనుషుల పేర్లు నమోదు” లేక “ప్రజలు జాబితా” లేక “మనుషుల పేర్లు రాయడం."

(చూడండి: జాతి, రోమ్)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3789, H5674, H5921, H6485, H7218, G582, G583