te_tw/bible/other/castout.md

2.8 KiB
Raw Permalink Blame History

విసరడం, వెళ్ళగొట్టడం, త్రోసి వెయ్యడం

నిర్వచనం:

ఎవరినైనా ఒకరిని లేదా దేనినైనా "విసిరి వెయ్యడం" లేదా "వెళ్ళగొట్టడం" అంటే ఆ వ్యక్తిని గానీ వస్తువును గానీ వెళ్ళిపోయేలా బలవంతం చెయ్యడం.

  • "విసిరి వెయ్యడం" పదం "త్రోసి వెయ్యడం" పదం లాంటిదే. వలను విసరండి అంటే వలను నీటిలో త్రోసివెయ్యండి అని అర్థం."
  • అలంకారికంగా భావనలో ఒకరిని "బయటకు విసరివెయ్యడం" లేదా "దూరంగా విసిరివెయ్యడం" అంటే అతనిని తృణీకరించడం, వెలుపలికి త్రోసివెయ్యడం అని అర్థం.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, ఈ పదం "బయటికి నెట్టివెయ్యడం" లేదా "బయటికి పంపివెయ్యడం" లేదా "వదిలించుకోవడం" అని ఇతర విధాలుగా అనువదించబడవచ్చు.
  • "దయ్యాలను వెళ్ళగొట్టడం" పదబంధం "దయ్యాలు వడిచిపెట్టేలా చెయ్యడం" లేదా "దయ్యాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపించడం" అని అనువదించబడవచ్చు.
  • సమాజమందిరం నుండీ లేదా సంఘం నుండీ ఒకరిని "వెళ్ళగొట్టడం" పదబంధం "బహిష్కరించడం" లేదా "వారిని వెలుపల ఉంచడం" అని అనువదించబడవచ్చు.

(చూడండి:demon, demon-possessed, lots)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1272, H1644, H1920, H3423, H7971, H7993, G15440