te_tw/bible/other/avenge.md

3.9 KiB
Raw Permalink Blame History

ప్రతీకారం, ప్రతీకారం చేయు, ప్రతీకారం చేసిన, ప్రతీకారం చేసే వాడు, పగ, పగ సాధించు

నిర్వచనం:

"ప్రతీకారం చేయు” లేక “పగ తీర్చుకోను” లేక “పగ సాధించు"అంటే ఒకడు చేసిన దానికి అతణ్ణి శిక్షించు. ప్రతీకారం, లేక పగ. "పగ సాధించు."

  • సాధారణంగా "ప్రతీకారం"అంటే న్యాయం జరగాలన్న ఉద్దేశం, లేదా జరిగిన తప్పును సరి దిద్దాలని చూడడం.
  • మనుషులకు సంబంధించి "పగ తీర్చుకొను” లేక “ప్రతీకారం చేయు"అంటే సాధారణంగా హాని చేసిన వాడికి తగిన శాస్తి చేయడం.
  • దేవుడు "పగ సాధించినప్పుడు” లేక “పగ సాధిస్తే," అతడు నీతిగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే అతడు పాపంపై తిరుగుబాటుపై శిక్ష విధిస్తున్నాడు.

అనువాదం సలహాలు:

  • దీన్ని"ప్రతీకారం"అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "జరిగిన తప్పును సవరించు” లేక “న్యాయం సాధించు."
  • మానవులకు సంబంధించి "పగ తీర్చుకోవడం"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కక్ష సాధించు” లేక “శిక్షించడం కోసం గాయపరచు” లేక “దెబ్బకు ."
  • సందర్భాన్ని బట్టి, "పగ సాధించు"అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"శిక్ష” లేక “పాపానికి శిక్ష” లేక “జరిగిన తప్పులకు శాస్తి." కొన్ని సార్లు "ప్రతి శిక్ష"అనే మాట ఉపయోగిస్తారు, ఇది మనుషులకు మాత్రమే వర్తిస్తుంది.
  • దేవుడు "నా పగ సాధించుకుంటాను," అంటే "నాకు వ్యతిరేకంగా చేసిన తప్పులకు శిక్ష వేస్తాను” లేక “ఎందుకంటే వారు నాకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు వారికి కీడు కలిగిస్తాను."
  • దేవుని పగ సాధింపును చెప్పేటప్పుడు అయన పాపానికి తన శిక్ష వేస్తాడు అని గుర్తుంచుకోవాలి.

(చూడండి:punish, just, righteous)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1350, H3467, H5358, H5359, H5360, H8199, G15560, G15570, G15580, G37090