te_tw/bible/kt/justice.md

12 KiB
Raw Permalink Blame History

న్యాయమైన, న్యాయం, అన్యాయమైన, అన్యాయం, నిర్దోషిగా/నీతిమంతులుగా చేయు, నీతిమంతునిగా తీర్చబడడం

నిర్వచనం:

"న్యాయమైన,” “న్యాయం” పదాలు దేవుని చట్టం ప్రకారం ప్రజలను నిష్పక్షపాతంగా చూడడం అని సూచిస్తుంది. ఇతరుల పట్ల సరియైన ప్రవర్తనలో దేవుని ప్రమాణాన్ని ప్రతిబింబించే మానవ చట్టాలు కూడా న్యాయమైనవే.

  • "న్యాయంగా" ఉండడం ఇతరుల పట్ల న్యాయంగానూ, సరియైన విధానంలో ఉండే చర్య. ఇది దేవుని దృష్టిలో నైతికంగా సరియైన దానిని చెయ్యడానికి నిజాయితీనీ, యథార్థతనూ సూచిస్తుంది.
  • "న్యాయంగా" ప్రవర్తించడం అంటే దేవుని చట్టం ప్రకారం సరియైన, మంచి, సక్రమమైన విధానంలో ప్రజలను చూడడం అని అర్థం.
  • "న్యాయం" పొందడం అంటే చట్టం ప్రకారం న్యాయంగా చూడడం, దీనిలో చట్టం చేత కాపాడబడడం గానీ లేదా చట్టాన్ని ఉల్లంఘించినందుకు శిక్షించబడడం కానీ ఉంటుంది.
  • కొన్ని సార్లు "న్యాయమైన" అనే పదము "నీతి" లేదా "దేవుని చట్టాలను అనుసరించడం" లాంటి విస్తృత అర్థాన్ని కలిగి యుంది.

"అన్యాయమైన," "అన్యాయంగా" పదాలు ప్రజలను పక్షపాతంగానూ, తరచుగా హానికరమైన విధానంలో చూడడం అని సూచిస్తుంది.

  • "అన్యాయం" అంటే ఒక వ్యక్తి పట్ల ఏదైనా కీడును ఆ వ్యక్తి పాత్రుడు కాకపోయినా చేయడం. ప్రజలను పక్షపాతంతో చూడడాన్ని సూచిస్తున్నది.
  • అన్యాయం అంటే కొందరిని చెడుగా చూడడం, మరికొందరిని మంచిగా/చక్కగా చూడడం అని కూడా అర్థం.
  • ఎవరైనా  "పక్షపాతం"తో లేదా "దురభిమానం"తో వ్యవహరించడం అన్యాయం. ఎందుకంటే అతడు ప్రజలను సమానంగా చూడడం లేదు.

"నిర్దోషిగా చేయడం" లేదా "నీతిమంతుడిగా తీర్చడం" పదం అపరాధ భావంతో ఉన్న వ్యక్తిని నీతిమంతుడుగా ఉండేలా చెయ్యడం/ఆపాదించడం. దేవుడు మాత్రమే మనుష్యులను నిర్దోషులుగా చెయ్యగలడు/తీర్చగలడు.

  • దేవుడు మనుషులను నిర్దోషులుగా చేసినప్పుడు ఆయన వారి పాపాలను క్షమిస్తాడు, వారు పాపం చెయ్యలేదన్నట్టుగా చేస్తాడు. పశ్చాత్తాపపడి, తమ పాపముల నుండి రక్షించడానికి యేసు నందు విశ్వాసం ఉంచిన పాపులను ఆయన నిర్దోషులుగా/నీతమంతులుగా చేస్తాడు.
  • "నీతిమంతునిగా తీర్చబడడం" అనేది దేవుడు ఒక వ్యక్తి పాపములను క్షమించి ఆయన దృష్టిలో అతడు నీతిమంతుడుగ ఉన్నాడు అని ప్రకటించడంలో దేవుడు చేసేదానిని సూచిస్తుంది.

అనువాదం సలహాలు :

  • సందర్భాన్ని బట్టి, "న్యాయమైన" అనే పదముకు అనువాదంలో "నైతికంగా సరియైన" లేదా "న్యాయబద్దమైన" పదాలను  జతచెయ్యవచ్చు.
  • "న్యాయం" అనే పదమును "న్యాయబద్ధంగా వ్యవహరించడం" లేదా "అర్హమైన పరిణామాలు" అని అనువదించవచ్చు.
  • "న్యాయంగా ప్రవర్తించడం" అనే పదమును "న్యాయబద్ధంగా చూడడం" లేదా "సరియైన విధానంలో ప్రవర్తించడం" అని అనువదించవచ్చు.
  • కొన్ని సందర్భాల్లో, "న్యాయం" అనే పదమును "నీతివంతమైన" లేదా "న్యాయబద్ధమైన" అని అనువదించవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, "అన్యాయం" అనే పదమును "న్యాయబద్ధంకాని" లేదా "పక్షపాతం" లేదా "దుష్టత్వమును" అని అనువదించవచ్చు.
  • "అన్యాయమైన" అనే పదబంధమును "అన్యాయమైన వారు" లేదా "అన్యాయమైన ప్రజలు" లేదా "ఇతరులను అన్యాయంగా చూచే ప్రజలు" లేదా "అనీతిమంతులైన ప్రజలు" లేదా "దేవునికి అవిధేయత చూపించేవారు" అని అనువదించవచ్చు.
  • "అన్యాయంగా" అనే పదమును "అన్యాయమైన విధానంలో" లేదా "తప్పుగా" లేదా “న్యాయబద్ధం కాని" అని అనువదించవచ్చు.
  • "అన్యాయం" అనే పదమును "తప్పుగా వెవహరించడం" లేదా "అసమానంగా చూడడం" లేదా "పక్ష పాతంతో చూడడం" పదాలుతో పలు విధాలుగా అనువదించవచ్చు. (చూడండి: భావనామాలు)
  • "నిర్దోషిగా చెయ్యడం" అనే పదమును "(ఒకరిని) నిర్దోషిగా ప్రకటించడం" లేదా "(ఒకరిని) నీతిమంతుడిగా ఉండేలా చెయ్యడం" అని ఇతరవిధాలుగా అనువదించవచ్చు.
  • "నీతిమంతులుగా తీర్చబడడం" అనే పదమును "నీతిమంతుడిగా ప్రకటించబడడం" లేదా "నీతిమంతుడిగా మారడం" లేదా "ప్రజలు నీతిమంతులుగా ఉండేలా చెయ్యడం" అని అనువదించవచ్చు.
  • "నీతిమంతులుగా తీర్చబడడం ఫలితంగా" పదబంధమును "దేవుడు అనేక మందిని నీతిమతులుగా తీర్చునట్లు" లేదా "దేవుడు మనుషులను నీతిమంతులుగా చెయ్యడం ఫలితంగా" అని అనువదించవచ్చు.
  • "మనం నీతిమతులుగా తీర్చబడడం కోసం" పదబంధమును "దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడడం కోసం" అని అనువదించవచ్చు.

(చూడండి: క్షమించుఅపరాధ భావంన్యాయాధిపతి/తీర్పుతీర్చు, నీతినీతిమంతుడు)

బైబిలు రిఫరెన్సులు:

బైబిలు కథల నుండి ఉదాహరణలు:

  • __17:9__దావీదు న్యాయంగా/ తోనూ, నమ్మకత్వంతోనూ అనేక సంవత్సరాలు పరిపాలన చేశాడు, దేవుడు అతనిని ఆశీర్వదించాడు.
  • __18:13__కొదరు (యూదా దేశపు)రాజులు మంచి వారు, వారు న్యాయంగా పరిపాలించారు, దేవుణ్ణి ఆరాధించారు.
  • 19:16 వారు (ప్రవక్తలు) విగ్రహాలను పుజించకుండా ఇతరుల పట్ల న్యాయం కరుణ చూపుతూ ఉండాలని ప్రజలకు చెప్పారు.
  • __50:17__యేసు తన రాజ్యాన్ని సమాధానంతోనూ, న్యాయం తోనూ తన ప్రజలను శాశ్వతకాలం పరిపాలిస్తాడు.

పదం సమాచారం:

  • Strongs: H0205, H2555, H3477, H4941, H5765, H5766, H5767, H6662, H6663, H6664, H6666, H8003, H8264, H8636, G00910, G00930, G00940, G13420, G13440, G13450, G13460, G13470, G17380