te_tw/bible/other/ambassador.md

3.0 KiB

రాయబారి, ప్రతినిధి

నిర్వచనము

రాయబారి అనగా, విదేశాల్లో తన దేశాని పక్షంగా  అధికార ప్రతినిధిగా ఉండుటకు ఎన్నికైనవాడు.ఈ పదాన్ని అలంకారికంగా కొన్ని సార్లు సాధాణంగా "ప్రతినిధి" అని కూడా అనువదించడము జరుగుతుంది. .

  • ఒక రాయబారి లేక ప్రతినిధి తనను పంపిన వ్యక్తి,లేక దేశం నుండి సందేశాలు తెచ్చి వినిపిస్తాడు.
  • ఎక్కువ వాడుకలో ఉన్న "ప్రతినిధి"అనే పదం,  తను ఎవరికైతే ప్రతినిధిగా ఉన్నాడో ఆ  వ్యక్తి తరపున మాటలాడుటకు మరియు వ్యవహరించుటకు,అధికారం ఇవ్వబడినటువంటి వ్యక్తిని సూచిస్తుంది.
  • క్రైస్తవులు క్రీస్తు "రాయబారులు” లేక “ప్రతినిధులు" అని అపొస్తలుడైన పౌలు బోధించాడు. ఎందుకంటే వారు ఈ లోకంలో క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇతరులకు అయన సందేశాన్ని బోధిస్తారు.
  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని, "అధికార ప్రతినిధి” లేక “నియమించ బడిన వార్తాహరుడు” లేక “ఎంపిక అయిన ప్రతినిధి” లేక “దేవుని నియమించిన ప్రతినిధి." అని అనువదించవచ్చు.
  • "రాయబారుల బృందం"అనే మాటను, "అధికార వార్తాహరులు” లేక “నియమించ బడిన ప్రతినిధుల బృందం” లేక “అందరి పక్షంగా మాట్లాడగలిగిన అధికార వ్యక్తుల బృందం."

(చూడండి: తెలియనివాటిని  అనువదించడం ఎలా) How to Translate Unknowns

(చూడండి: వార్తాహరుడు)

బైబిల్ రిఫరెన్సులు

  • ఎఫెసి 06:19-20
  • లూకా 14:31-33
  • లూకా 19:13-15

పదం సమాచారం:

  • Strong's: H3887, H4135, H4136, H4397, H6735, H6737, G42430