te_tw/bible/other/afflict.md

3.8 KiB
Raw Permalink Blame History

బాధించు, బాధ, వేదన

నిర్వచనం:

బాధించు అనే ఈ పదం ఎవరికైనా బాధ, నొప్పి కలిగించడం అనే దానికి వాడతారు. "బాధ" అంటే వ్యాధి, మానసిక వేదన, లేక అలాటి ఫలితం కలిగించే ఇతర విషయాలు.

  • కొన్నిసార్లు దేవుడు తన ప్రజలు వారు తమ పాపాలకు పశ్చాత్తాపపడి తన వైపుకు తిరిగి రావాలనే ఉద్దేశ్యంతో. వారిని అనారోగ్యముతో లేదా ఇతర కష్టాలతో బాధపెట్టారు.
  • ఐగుప్తు ప్రజలు దేవునికి విధేయత చూపడానికి నిరాకరించినందున దేవుడు వారికి కష్టాలు లేదా తెగుళ్లు వచ్చేలా చేశాడు.
  • “బాధించబడడం” అంటే వ్యాధి, హింస, లేదా ఉద్రేకపూరితమైన దుఃఖం వంటి వేదనతో బాధపడడం అని అర్థం. .
  • కొన్ని పాత నిబంధన సందర్భాలలో, “తనను తాను బాధించుకోవడం” లేదా “ఒకరి ఆత్మను బాధించడం” అనే ఆలోచన ఆహారం తినకుండా ఉండటాన్ని సూచిస్తుంది.

అనువాదం సూచనలు:

  • బాధించడం అనే వాక్యాన్ని ఎవరినైనా కష్టాల పాలు చెయ్యడం.” లేక “ఒకరిని బాధ పెట్టడం” లేక “కష్టాలు వచ్చేలా చెయ్యడం" అని అనువాదం చెయ్యవచ్చు.
  • "ఎవరికైనా కుష్టువ్యాధి కలిగించు"అనే వాక్యాన్ని "కుష్టువ్యాధితో వ్యాధి బారిన పడేలా చెయ్యడం" అని అనువాదం చెయ్యవచ్చు.
  • ప్రజలు లేదా జంతువులకు "బాధ" కలిగించడానికి ఒక వ్యాధి లేదా విపత్తు పంపబడినప్పుడు, దీనిని "బాధ కలిగించడం" అని అనువదించవచ్చు.
  • సందర్భాన్ని బట్టి, ఈ పదం "బాధ" పదాన్ని "ఆపద” లేక “వ్యాధి” లేక “బాధ” లేక “గొప్ప కష్టం" అని అనువాదం చెయ్యవచ్చు.
  • "బాధించు"పదాన్ని "దానినుండి బాధించు" లేదా లేక “దానితో వ్యాధి కలిగించు." అని కూడా అనువాదం చెయ్యవచ్చు.

(చూడండి:leprosy, plague, suffer)

బైబిల్ రిఫరెన్సులు:

  • [2తెస్స 01:6-8]
  • [ఆమోసు 05:12-13]
  • [కొలస్సి 01:24-27]
  • [నిర్గమ 22:22-24]
  • [ఆది 12:17-20]
  • [ఆది 15:12-13]
  • [ఆది 29:31-32]

పదం సమాచారం:

  • Strongs: H0205, H3013, H3905, H3906, H6031, H6039, H6040, H6041, H6862, H6869, H6887, H7451, H7489, G23460, G23470, G38040