te_tw/bible/other/suffer.md

6.8 KiB
Raw Permalink Blame History

బాధపడు, శ్రమనొందుట

నిర్వచనము:

“బాధపడు” మరియు “శ్రమనొందుట” పదములు రోగములాంటివి, బాధలాంటివి లేక ఇతర కష్టములులాంటివి అనుభవించుటను సూచించును.

·         ప్రజలు హింసనొందునప్పుడు లేక వారు రోగాలతో ఉన్నప్పుడు, వారు బాధనొందుదురు.

·         కొంతమంది ప్రజలు కొన్ని తప్పుడు పనులు చేసినప్పుడు శ్రమనొందుదురు; ఇతర సమయాలలో ప్రపంచములో పుట్టుకు వస్తున్నా రోగాల ద్వారా మరియు పాపము ద్వారా వారు హింసనొందుదురు.

·         శ్రమనొందడం భౌతిక సంబంధమైనది, నొప్పి లేక రోగమును అనుభవించుటయైయున్నది. ఇది భయము, భావోద్వేగమునకు, దిగులుకు, లేక ఒంటరితనము అనేటువంటి మానసికమైన బాధలకు కూడా సంబంధించినదైయుండును.

·         “నన్ను బాధించు” అనే మాటకు “నన్ను భరించు” లేక “నా మోర విను” లేక “సహనముతో విను” అని అర్థము.

తర్జుమా సలహాలు:

  •  “బాధపడు” అనే ఈ పదానికి “బాధను అనుభవించు” లేక “కష్టాన్ని సహించు” లేక “క్లిష్ట పరిస్థితులను అనుభవించు” లేక “క్లిష్టమైన మరియు బాధాకరమైన అనుభవాల ద్వారా వెళ్ళు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • సందర్భానుసారముగా “శ్రమనొందుట” అనే ఈ మాటను “అత్యంత క్లిష్ట పరిస్థితులు” లేక “తీవ్రమైన కష్టాలు” లేక “క్లిష్టకరమైన కష్టమైన పరిస్థితులను అనుభవించుట” లేక “బాధాకరమైన అనుభవాల సమయము” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “దాహముతో బాధపడు” అనే ఈ మాటను “దాహమును అనుభవించు” లేక “దాహముతో శ్రమనొందుట” అని తర్జుమా చేయుదురు.
  • “హింసాత్మకముగా బాధననుభవించు” అనే ఈ మాటను “హింసాత్మకమైన పరిస్థితుల ద్వారా వెళ్ళుట” లేక “హింసాత్మకమైన క్రియల ద్వారా హాని నొందుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహరణలు:

  • 9:13 “నేను నా ప్రజల శ్రమలను చూచియున్నాను” అని దేవుడు చెప్పెను.
  • 38:12“నా తండ్రి, సాధ్యమైతే ఈ శ్రమల గిన్నెను నాయొద్దనుండి తీసివేయుము” అని యేసు మూడు మార్లు ప్రార్ధించెను.
  • __42:3__మెస్సయ్యా శ్రమనొందును మరియు చంపబడును, కాని ఆయన మూడవ దినమున తిరిగిలేచును అని ప్రవక్తలు చెప్పియున్నారని ఆయన (యేసు) జ్ఞాపకము చేసెను.
  • 42:7“మెస్సయ్యా శ్రమనొందును మరియు చంపబడును, కాని ఆయన మూడవ దినమున తిరిగిలేచునని వ్రాయబడియున్నది” అని ఆయన (యేసు) చెప్పెను.
  • 44:5 “మీరు ఏమి చేయుచున్నారో మీకు అర్థము కాకపోయినప్పటికి, మెస్సయ్యా శ్రమనొందును
  • 46:4“రక్షించబడనివారికందరికి ప్రకటించుటకు నేను ఇతనిని (సౌలును) ఎన్నుకొనియున్నాను. నా కొరకు ఇతను తప్పకుండ ఎన్ని శ్రమలు పడాలో చూపించెదను” అని దేవుడు చెప్పెను.
  • 50:17 ఆయన (యేసు) ప్రతి కన్నీటిని తుడిచివేయును మరియు అక్కడ శ్రమ , బాధ, ఏడ్పు, కీడు, నొప్పి, లేక మరణము అనేవి ఉండవు.

పదం సమాచారం:

  • Strongs: H0943, H1741, H1934, H4531, H5142, H5375, H5999, H6031, H6040, H6041, H6064, H6090, H6770, H6869, H6887, H7661, G00910, G09410, G09710, G22100, G23460, G23470, G25520, G25530, G25610, G38040, G39580, G43100, G47780, G47770, G48410, G50040