2.6 KiB
2.6 KiB
తూరు, తూరీయులు
వాస్తవాలు:
తూరు ఒక ప్రాచీన కనానీయ పట్టణం. ఇది మధ్యదరా సముద్రం తీరాన ఇప్పుడు ఆధునిక లెబానోనులో భాగంగా ఉంది. దాని ప్రజలను "తూరీయులు" అన్నారు.
- పట్టణంలోకొంత భాగం సముద్రంలో ద్వీపంలో ఉంది. భూభాగం నుంచి ఒక కిలో మీటర్ దురాన ఉంది.
- దేవదారుచెట్లు వంటి దీని విలువైన సహజ వనరుల మూలంగా, తూరు ధనిక వాణిజ్య పారిశ్రామిక కేంద్రం అయింది.
- తూరు రాజు రాజు హిరాము దేవదారు చెట్ల కలపను, నిపుణత గల శ్రామికులను దావీదు రాజు అంతఃపురం కట్టడానికి సహాయంగా పంపించాడు.
- చాలా సంవత్సరాల తరువాత, హిరాము సొలోమోను రాజుకు కూడా కలప, నిపుణత గల శ్రామికులను ఆలయ నిర్మాణంలో సహాయంగా పంపాడు. సొలోమోను అతనికి విస్తారమైన గోదుమ, ఒలీవనూనె చెల్లించాడు.
- తూరు తరచుగా పక్కన ఉన్న ప్రాచీన పట్టణం సీదోనుతో సంబంధం కలిగి ఉంటుంది. ఇవి ఫోనిషియాలో ప్రాముఖ్యమైన కనాను పట్టణాలు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి:Canaan, cedar, Israel, the sea, Phoenicia, Sidon)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H6865, H6876, G51830, G51840