3.0 KiB
3.0 KiB
గిబియోను, గిబియోనీయుడు, గిబియోనీయులు
వాస్తవాలు:
గిబియోను యెరూషలేముకు వాయవ్యంగా 13 కిలో మీటర్ల దూరాన ఉన్న పట్టణం. గిబియోనులో నివసించే ప్రజలు గిబియోనీయులు.
- ఇశ్రాయేలీయులు యెరికో, హాయి పట్టణాలు నాశనం చేశారని గిబియోనీయులు విన్నారు. వారు భయపడ్డారు.
- కాబట్టి గిబియోనీయులు గిల్గాలులో ఇశ్రాయేలు నాయకుల దగ్గరకు వచ్చి దూర దేశం నుండి వచ్చిన వారుగా నటించారు.
- ఇశ్రాయేలు నాయకులు మోసపోయి వారిని నాశనం చేయక, కాపాడుతామని గిబియోనీయులతో ఒప్పందం చేసుకున్నారు.
(చూడండి: గిల్గాలు, యెరికో, యెరూషలేము)
బైబిల్ రిఫరెన్సులు:
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 15:06 అయితే ఒక కనానీయ ప్రజలు సమూహం గిబియోనీయులు అనే వాళ్ళు యెహోషువాతో అబద్ధం చెప్పారు. తాము కనానుకు చాలా దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పారు.
- 15:07 కొంత కాలం తరువాత, కనాను, అమోరీయుల రాజులు ఇంకా ఇతర సమూహం గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో శాంతి ఒప్పందం చేసుకున్నారని విన్నారు. వారి సేనలు కూడగట్టుకుని ఒక పెద్ద సైన్యంతో గిబియోను పై దాడి చేశారు.
- 15:08 యెహోషువా ఇశ్రాయేలు సైన్యం సమకూర్చాడు. వారు రాత్రి అంతా నడిచి గిబియోనీయుల దేశం చేరుకున్నారు.
పదం సమాచారం:
- Strong's: H1391, H1393