3.4 KiB
3.4 KiB
బత్షెబ
వాస్తవాలు:
బత్షెబ ఊరియా భార్య, యితడు దావీదు రాజు సైన్యంలో ఒక సైనికుడు. ఊరియా మరణం తరువాత, ఆమె దావీదు భార్య అయింది. ఈమే సొలోమోను తల్లి.
- దావీదు బత్షెబతో ఆమె ఊరియాకు భార్యగా ఉన్నప్పుడే వ్యభిచారం చేసాడు.
- బత్షెబ దావీదు మూలంగా గర్భవతి అయినప్పుడు సమరంలో ఊరియా చనిపోయేలా దావీదు ఏర్పాటు చేశాడు.
- దావీదు తరువాత బత్షెబను పెళ్లి చేసుకున్నా. ఆమె వారి బిడ్డకు జన్మ నిచ్చింది.
- దేవుడు ఆ బిడ్డ పుట్టిన కొద్ది దినాలకే అతడు చని పోయేలా చేయడం ద్వారా దావీదు చేసిన పాపం నిమిత్తం అతణ్ణి శిక్షించాడు.
- తరువాత, బత్షెబ మరొక కుమారుడు సొలోమోనుకు జన్మ నిచ్చింది. అతడు పెరిగి దావీదు తరువాత రాజయ్యాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదిండం ఎలా)
(చూడండి: దావీదు, సొలోమోను. ఊరియా)
బైబిల్ రిఫరెన్సులు:
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 17:10 ఒక రోజు, దావీదు సైనికులంతా యుద్ధాలకు వెళ్ళిన సమయంలో అతడు సాయంత్రం నిద్ర లేచిన తరువాత ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తుండగా చూశాడు. ఆమె పేరు బత్షెబ.
- 17:11 కొద్ది కాలం తరువాత బత్షెబ దావీదుకు తాను గర్భవతినయ్యానని కబురు పంపింది.
- 17:12 బత్షెబ భర్త ఊరియా, దావీదు మంచి సైనికుల్లో ఒకడు.
- 17:13 ఊరియా హతం అయ్యాక దావీదు బత్షెబను పెళ్లి చేసుకున్నాడు.
- 17:14 తరువాత, దావీదు, బత్షెబలకు మరొక కుమారుడు కలిగాడు. అతడు సొలోమోను.
పదం సమాచారం:
- Strong's: H1339