te_tw/bible/names/abiathar.md

1.7 KiB

అబ్యాతారు

నిర్వచనం:

అబ్యాతారు దావీదు రాజు కాలంలో ఇస్రాయెల్ జాతికి ప్రధాన యజకునిగా ఉన్నాడు.

  • సౌలు రాజు యాజకులను చంపించిన తరువాత అబ్యాతారు తప్పించుకుని అడవిలో దావీదును చేరుకున్నాడు.
  • అబ్యాతారు, సాదోకు అనే మరొక ప్రధాన యాజకుడు దావీదు పరిపాలన కాలంలో నమ్మకంగా సేవ జరిగించారు.
  • దావీదు మరణం తరువాత సొలోమోను కు బదులుగా రాజు కావడానికి అదోనియాకు అబ్యాతారు తోడ్పడ్డాడు.
  • ఈ కారణం చేత సొలోమోను రాజు అబ్యాతారును యాజకత్వం నుండి తొలగించాడు.

(చూడండి: సాదోకు, సౌలు , దావీదు, సొలోమోను, అదోనియా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H54, G8