te_tw/bible/kt/name.md

5.0 KiB
Raw Permalink Blame History

పేరు

నిర్వచనము :

“పేరు” (నామం) అనే పదం ఒక న వ్యక్తిని లేదా వస్తువును స్పష్టంగా పిలిచే  పదాన్ని సూచిస్తుంది. అయితే బైబిలులో "పేరు"  అనేక భిన్నమైన అంశాలను సూచించడానికి అనేక భిన్నమైన విధానాలలో ఉపయోగించబడింది.

●        “కొన్ని సందర్భాలలో "పేరు" అన్నది  "మన కోసం పేరు సంపాదించుకొందాము" అనే వాక్యంలో ఉన్నట్లు వ్యక్తి ప్రసిద్ధిని సూచిస్తుంది.

●        ”పేరు” అంటే ఒకదాని జ్ఞాపకం అని కూడా సూచిస్తుంది. ఉదాహరణకు, “విగ్రహాల పేర్లను కొట్టివేయండి” అంటే వాటి జ్ఞాపకం లేకుండా, ప్రజలు వాటిని పూజించకుండా ఆ విగ్రహాలను నాశనం చెయ్యండి అని అర్థం.

●        ”దేవుని పేరున” మాట్లాడుతున్నాను అంటే ఆయన శక్తితోనూ, ఆయన అధికారంతోనూ లేదా ఆయన ప్రతినిధిగా మాట్లాడుతున్నాను అని అర్థం.

●        “ఆకాశం క్రింద మరి యే నామమున మనం రక్షణ పొందలేము” అనే వాక్యంలో ఉన్నట్టు ఒకని “పేరు” అతని పూర్తి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. (చూడండి: అన్యాపదేశం)

అనువాదం సలహాలు:

●        “ఆయన మంచి పేరు” లాంటి మాటను “ఆయన మంచి కీర్తి” అని అనువదించవచ్చు.

●        ”పేరులో” దేనినైనా చెయ్యడం అనే మాటను “అధికారంతో” లేదా “అనుమతితో” లేదా ఆ వ్యక్తి “ప్రతినిధిగా” చెయ్యడం అని అనువదించవచ్చు.

●        ”మనకోసం పేరు సంపాదించుకొందము” అనే వాక్యం “అనేకులు మనల్ని తెలుసుకొనేలా చేసుకొందాం” లేదా “మనం ప్రాముఖ్యం అని అనేకమంది తలంచేలా చేసుకొందాం” అని అనువదించవచ్చు.

●        ”ఆయన పేరున ప్రార్థించండి” అనే వాక్యం “పేరును పిలవండి” లేదా “ఆయనకు పేరునివ్వండి” అని అనువదించవచ్చు.

●        ”నీ పేరును ప్రేమించువారు” అనే వాక్యం “నిన్ను ప్రేమించువారు” అని అనువదించవచ్చు.

●        ”విగ్రహాల పేర్లు కొట్టివెయ్యండి” అనే వాక్యం “వాటిని జ్ఞాపకంలోనికి తెచ్చుకొనకుండా అన్య విగ్రహాలను నాశనం చెయ్యండి” లేదా “అబద్ధపు దేవుళ్ళను ఆరాధించకుండ మనుష్యులను నిలువరించండి” లేదా “మనుష్యులు వాటిని గురించి ఇకమీదట తలంచకుండా విగ్రహాలన్నిటిని పూర్తిగా నాశనం చెయ్యండి” అని అనువదించవచ్చు.

(చూడండి:call)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H5344, H7121, H7761, H8034, H8036, G25640, G36860, G36870, G51220